https://oktelugu.com/

Canada: ధనిక దేశంలో ఆకలి కేకలు.. పిల్లల కోసం పస్తులుంటున్న తల్లిదండ్రులు..

అది ధనిక దేశం. అమెరికాకు పక్కనే ఉండే దేశం. అక్కడ మన దేశానికి చెందినవారు చాలామంది ఉంటారు. పెద్ద పెద్ద విద్యాసంస్థలు అక్కడ ఉన్నాయి. అక్కడ చదువుకోడానికి మన దేశం నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది వెళ్తుంటారు. అయితే అలాంటి దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పిల్లల కడుపు నింపడానికి పెద్దలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 29, 2024 / 01:00 AM IST

    Canada(2)

    Follow us on

    Canada: కొంతకాలంగా కెనడా దేశంలో పరిస్థితి బాగోలేదు. అక్కడ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరింది. ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడానికి అనేక త్యాగాలు చేస్తున్నారు. చివరికి తమ కడుపు మాడ్చుకుంటున్నారు. బ్లెండర్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఆహార ఉత్పత్తుల ధరలు 2015తో పోల్చితే 300 శాతం పెరిగాయి. దేశ జనాభాలో 20 శాతం మంది అంటే 1.4 మంది పిల్లలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఫుడ్ బ్యాంక్ సేవలను అందుకునే వారు గడచిన ఐదు సంవత్సరాలలో 90% పెరిగారు. దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఉన్న నేపథ్యంలో కెనడా అధ్యక్షుడు ట్రూడో ఇందులో తమ ప్రభుత్వం తప్పేమీ లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. పైగా “మీ పిల్లలకు ఆహారం పెట్టడానికంటే, ఇంటి అద్దెలు చెల్లించడాని కంటే వాతావరణ పరిస్థితులను అధిగమించడంపై దృష్టి సారించాలి. వాతావరణంలో మనిషి జీవితానికి వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై పోరాటం చేయాలని” పిలుపునివ్వడం విశేషం.

    పిల్లల ఆకలి తీర్చుకోవడానికి..

    సరుకుల ధరలు పెరగడంతో పిల్లల అవసరాలు తీర్చడానికి తల్లిదండ్రులు పస్తులు ఉంటున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో పొదుపు చేయడానికి కనబడుచుకుంటున్నారు.. ఆర్థిక బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి తల్లిదండ్రులు తమ ఆహారంలో కోత విధించుకుంటున్నారు. నిత్యావసరాలను కూడా తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆహారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసే ఫుడ్ బ్యాంకులు కూడా కొరత ఏర్పడింది.. ఫలితంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఉచితంగా ఆహారం ఇవ్వకూడదని ఫుడ్ బ్యాంకులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఈ బాధితుల జాబితాలో భారతీయ విద్యార్థులు కూడా ఉండడం అత్యంత విషాదం. కెనడాలో కొంతకాలంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జీవన వ్యయం తారస్థాయికి చేరింది. ఇళ్ల అద్దెలు చుక్కల్ని అంటుతున్నాయి.. అందువల్లే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత ఆహారాన్ని అందించడానికి తమ తిండి మీద కోత విధించుకున్నారు. దేశ జనాభాలో 24 శాతం మంది తల్లిదండ్రులు ఇలా హోదా విధించుకుంటున్నారు.. పైగా పోషక విలువలు అత్యంత తక్కువగా ఉండే ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఇది మాత్రమే కాస్త తక్కువ ధరలో లభిస్తోంది. కొందరైతే ఒక పూట తిని, మరొకపూట మానేస్తున్నారు. దేశంలో ధరలు పెరగడం, ఆహార పదార్థాల ధరలు కూడా తారస్థాయికి చేరడంతో.. ఈ సమస్యలు ప్రస్తుత ట్రూడో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.. అయితే ప్రజలకు కాస్తలో కాస్త శాంతను కలిగించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాలపై పన్నులు తగ్గించే యువజన ప్రభుత్వ ఉన్నట్టు తెలుస్తోంది.. దుస్తులు, నెపీస్, ఫ్రీ మేడ్ హాట్ మీల్స్, మాంసం, మొక్కజొన్నతో తయారుచేసిన చిరు తిండ్లు వంటి వాటిపై ప్రభుత్వం ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు నిత్యావసరాలపై ప్రభుత్వం అన్ని రకాల టాక్స్ లను ఎత్తివేయాలని కోరుతున్నారు.