మన పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెబుతూ ఉంటారు. శరీరంలోని ఇంద్రియాలలో మిగతా వాటితో పోలిస్తే కళ్లు అతి ముఖ్యమైనవి. కంటికి చిన్న సమస్య వచ్చినా రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొందరిని కళ్లు ఎరుపెక్కడం వేధిస్తే మరి కొందరు కంటి ఇరిటేషన్ వల్ల, ఇతర సమస్యల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. కొందరు ఐ డ్రాప్స్ ను వాడితే సమస్య తగ్గుముఖం పడుతుంది.
Also Read: లవంగం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
అయితే కొందరు ఐ డ్రాప్స్ ను వాడినా ఎటువంటి ఫలితం ఉండదు. దుమ్ము, ధూళి వల్ల కొందరిని కళ్ల ఇరిటేషన్ వేధిస్తే మరి కొందరికి ముఖంపై ఉన్న ఆయిల్ కళ్లలో పడటం వల్ల కంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా కళ్ల సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఎలర్జీతో బాధ పడేవాళ్లు రోజుకు మూడుసార్లు కంటిని శుభ్రంగా కడుక్కుంటే మంచిది.
Also Read: ఈ లక్షణాలతో బాధ పడుతున్నారా.. విటమిన్ల లోపమే కారణం..?
మామిడి పండు, బొప్పాయి పండ్లు, క్యారెట్, బీట్ రూట్ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ పండ్లు కంటి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు పండ్లలో ఉంటే బీటా కెరోటిన్ కళ్లు కాంతివంతంగా ఉండటానికి కారణమవుతుంది. తరచూ ఆకుకూరలను తీసుకోవడం ద్వారా కూడా సులభంగా కంటి సమస్యలకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. మరి కొందరిలో వయస్సు వల్ల కంటి చూపులో తేడాలు వస్తాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
వయస్సు వల్ల వచ్చే కంటిచూపు తేడాలు కొందరిని వేధిస్తూ ఉంటాయి. కంటి సమస్యలు డైట్ లో మార్పులు చేసుకున్నా తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ద్వారా సులభంగా సమస్యకు చెక్ పెట్టవచ్చు. కళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.