మెగాస్టార్ చిరంజీవి.. మళ్ళీ సినిమాల్లోకి వస్తారు.. వరుసగా సినిమాలు చేస్తారు అని మెగాస్టార్ కూడా ఊహించలేదు. కానీ, కాలం ఆయన్ని మళ్ళీ రంగుల ప్రపంచం వైపుకు నెట్టింది. రాజకీయ ఎత్తుల దెబ్బకు నెట్టుకురాలేక ఓటమి పాలై అక్కడ మెగాస్టార్ అని అనిపించుకోలేక, ఫైనల్ గా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతున్నారు చిరు. ఇది మెగాస్టార్ కి ఎలా ఉందో తెలియదు గానీ, బట్ ఆయన అభిమానులకు మాత్రం మంచి కిక్ ను ఇస్తోంది. దీనికితోడు 2021లో చిరు స్పీడ్ గా సినిమాలు పూర్తి చెయ్యాలనుకుంటున్నారు.
Also Read: సండే స్పెషల్ : పాన్ ఇండియా హీరోలుగా.. తెలుగు హీరోలు !
ఇప్పటికే “ఆచార్య” సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నా.. విడుదల చెయ్యడమే కాదు రెండు రీమేక్ చిత్రాలను కూడా ఈ ఏడాది పట్టాలెక్కిస్తారు. “ఆచార్య” సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. మే నెలలో విడుదల కానుంది. అలాగే, “లూసిఫర్” రీమేక్, “వేదలమ్” రీమేక్ చిత్రాలను కూడా చిరు దసరా కల్లా పూర్తీ చేయాలని.. అందుకు తగ్గట్లుగా ఈ ఏడాది ఫుల్ డేట్స్ ను కేటాయిస్తున్నారు. ఇప్పటికే “లూసిఫర్” సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుండి షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.
Also Read: లవ్ స్టోరీ టీజర్ టాక్: నిరుద్యోగ ప్రేమ కంచికి చేరిందా?
అలాగే “వేదలమ్” టీం తమ ప్రీ-ప్రొడక్షన్ పనులు షురూ చేసిందట. మొత్తానికి ఒక సినిమా పూర్తి కాగానే, మరో సినిమాని సెట్స్ పైకి వచ్చేలా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు మెగాస్టార్. ఈ ఏడాది అంటే 2021లో ‘జై లవకుశ’, ‘వెంకీ మామ’ చిత్రాల దర్శకుడు బాబీ డైరెక్షన్ లో కూడా ఇంకో సినిమాని చిరు మొదలుపెట్టనున్నారు. ఆ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఈ నాలుగు సినిమాలతో చిరు దాదాపు 200 కోట్ల రూపాయలు సంపాదించేలా ప్లాన్ చేశారు మెగాస్టార్.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్