https://oktelugu.com/

దేశవ్యాప్తంగా ఆగిపోనున్న రైళ్లు.. వాట్సాప్ పోస్ట్ వైరల్..?

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం రైలు సర్వీసులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా పరిమితంగానే రైళ్లను నడుపుతోంది. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే రైల్వే శాఖ పూర్తిస్థాయిలో రైలు సర్వీసులను అందుబాటులోకి తెస్తుందో లేదో తెలీదు. అయితే వాట్సాప్ లో ఒక పోస్ట్ మాత్రం గత కొన్ని రోజుల నుంచి తెగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2020 / 08:40 AM IST
    Follow us on


    కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం రైలు సర్వీసులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా పరిమితంగానే రైళ్లను నడుపుతోంది. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే రైల్వే శాఖ పూర్తిస్థాయిలో రైలు సర్వీసులను అందుబాటులోకి తెస్తుందో లేదో తెలీదు.

    అయితే వాట్సాప్ లో ఒక పోస్ట్ మాత్రం గత కొన్ని రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులు ఆగిపోనున్నాయని వైరల్ అవుతున్న ఆ వార్త సారాంశం. కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ గురించి వార్తలు తెగ వైరల్ కాగా వాటి గురించి స్పందించి మరోసారి లాక్ డౌన్ ను అమలు చేయబోమని స్పష్టతనిచ్చింది. అయితే కేంద్రం స్పష్టతనిచ్చినా ఇలాంటి వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.

    డిసెంబర్ 1 నుంచి రైలు సర్వీసులు ఆగిపోతాయని ప్రచారం జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే రైల్వే శాఖ ఇప్పటికే వైరల్ అవుతున్న వార్త గురించి స్పందించి స్పష్టత ఇచ్చింది. వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. రైళ్ల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ తెలిపింది.

    ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైరల్ అవుతున్న వార్త గురించి స్పందించి స్పష్టతనిచ్చింది. అనుమానాస్పద మెసేజ్ వస్తే రైలు ప్రయాణికులు నిజనిర్ధారణ చేసుకోవాలని పీఐబీ సూచించింది. ప్రభుత సైట్లను సంప్రదించి తప్పుడు వార్తలు ఏవో నిజం వార్తలు ఏవో తెలుసుకునే అవకాశం ఉంటుంది.