Tippa Teega : పూర్వకాలంలో ఏదైనా అనారోగ్యం కలిగితే ఆకుపసరు వైద్యంతో నయం చేసుకునేవారు. కానీ కార్యక్రమం లో మెడిసిన్లు అందుబాటులోకి రావడంతో ఆకు పసర్లను వాడడం తక్కువైంది. అయితే ప్రకృతిలో లభించే కొన్ని రకాల మొక్కలు, చెట్లు ఎన్నో రకాల రోగాలను నయం చేస్తాయి. ఒకప్పుడు వీటిని ఉపయోగించి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకున్నారు. కానీ ఆ తర్వాత వీటిని మూఢనమ్మకాలు అని కొట్టి పారేసి వాడడం మానేశారు. కానీ కొందరు పెద్దలు చెబుతున్న ప్రకారం ప్రకృతిలో లభించే కొన్ని మొక్కల ద్వారా నయం అనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవి కొన్ని మన మధ్య ఉన్న.. వాటిని పట్టించుకోవడం లేదు. అలాంటి వాటిలో తిప్పతీగ ఒకటి. తిప్పతీగ ను మనం రోజు చూస్తూ ఉంటాం. కానీ దీనిని ఎవరూ పట్టించుకోరు. కానీ దీనివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. ఇంతకీ తిప్పతీగ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే?
Also Read : మండే ఎండల తాపం తగ్గాలంటే పుదీనా షర్బత్ తాగాల్సిందే. తయారీ ఎలాగంటే?
ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరు షుగర్ కంట్రోల్ కావడానికి అనేక రకాల మెడిసిన్ వాడుతూ ఉంటారు. అయితే కొన్ని ఆయుర్వేదిక మెడిసిన్ ద్వారా కూడా సుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తిప్పతీగ ఆకులను తీసుకోవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. దీంతో ఆటోమేటిగ్గా శరీరంలోకి ఇన్సులిన్ వెళ్తుంది. దీంతో రక్తంలో షుగర్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
యవ్వనం వయసులోనూ నేటి కాలంలో చాలామంది అనేక రకాల అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా 45 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు 30 ఏళ్ల వారికి వస్తున్నాయి. వీటిలో మోకాళ్ల నొప్పులు ఒకటి. మరికొందరు కీళ్లనొప్పులతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి తిప్పతీగ ఆకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. తిప్పతీగ ఆకులను తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంట్లో వండిన ఆహారం కంటే బయట ఫుడ్ ఎక్కువగా తినే వారు చాలామంది ఉన్నారు. దీంతో జీరక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటివారు అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటివారు తిప్పతీగ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తుంది. అంతేకాకుండా ప్రయోగ సమస్యలను నయం చేసి ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది.
అయితే ఎలాంటి సమస్యలు లేని వారు కూడా తిప్పతీగను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల జ్వరం వంటి చిన్న చిన్న వ్యాధులు కూడా రాకుండా కాపాడగలుగుతాయి. అయితే దీనిని ఎలా తీసుకోవాలి అంటే… తిప్పా ఆకులను గ్రైండ్ చేసి దాని రసం రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు. అలాగే దీనిని కషాయంలా చేసి ప్రతిరోజు తీసుకోవచ్చు. అయితే మొదటిసారిగా తీసుకునేవారు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎలాంటి సమస్యలు లేకపోతే ఆ తర్వాత కొనసాగించాలి. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు.. రైతులను సంప్రదించిన తర్వాతనే దీనిని తీసుకోవాలి.