Thyroid: ప్రస్తుత కాలంలో మనలో చాలామందిని ఎన్నో వ్యాధులు వేధిస్తున్నాయి. వ్యాధులలో ఎక్కువ వ్యాధులు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నాయి. ప్రస్తుతం మహిళల్లో చాలామంది సంతానలేమి వల్ల బాధ పడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సంతానలేమికి థైరాయిడ్ సమస్య కారణమయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ చిన్న సమస్యే అని చాలామంది భావించినా ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పడక తప్పదు.
థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మహిళలు థైరాయిడ్ తో బాధ పడుతున్నారో లేదో తెలిసే ఛాన్స్ ఉంటుంది. గర్భిణీ మహిళలకు థైరాయిడ్ ఉంటే గర్భంలోనే బిడ్డ చనిపోవడం లేదా బిడ్డకు అవయవాలకు సంబంధించిన సమస్యలు రావడం జరుగుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది.
మందులు వాడి సమస్యకు చెక్ పెడితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు అయితే ఉంటాయి. థైరాయిడ్ వల్ల నిత్యజీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పురుషులను కూడా ఈ సమస్య వేధించే అవకాశాలున్నా మహిళలతో పోల్చి చూస్తే తక్కువని చెప్పవచ్చు.
Also Read: Rajamouli: ఎంతో టాలెంట్ ఉన్న రాజమౌళి సీరియల్ డైరెక్ట్ చేయడానికి కారణమేంటో తెలుసా?