
భారత్ లో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చినా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. చలికాలంలో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొత్త ఆరోగ్య సమస్యలను గుర్తించారు.
కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో మానసిక సమస్యలు ఎదురవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయస్సులో పెద్దవాళ్లైనా కొందరి మనస్తత్వం చిన్నపిల్లల్లా మారిపోతున్నట్టు గుర్తించామని కోలుకున్న వాళ్లు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. 84 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్న వారిపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్నా కొంతమంది దీర్ఘకాలం మానసిక సమస్యలతో బాధపడే అవకాశం ఉందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో మెదడు పనితీరు, మతిమరపు లక్షణాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో మెదడు కొంత బలహీనంగా ఉందని తెలిపారు. గ్రేటి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పేరుతో ఈ అధ్యయనం చేశారు.
మరోవైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. డిసెంబర్ తొలివారం నాటికి భారత్ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలుపుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.