కిడ్నీలో రాళ్లు ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఉరుకులు పరుగుల జీవితంలో సరిగ్గా భోంచేయక, నీళ్లు తాగకపోవడంతో నాలుగు రాళ్లు వెనుకాల పడుతున్నాయి. కిడ్నీలో చేరి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంత బిజీగా ఉన్నఈ ఒక్క పండుతింటే కిడ్నీ రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని తాజాగా పరిశోదనలో తేలింది.
Also Read: డెలివరీ తర్వాత బరువు పెరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
ఎండు ద్రాక్ష కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వాటి నుంచి బయటపడొచ్చు. ఎసిడీటీతో బాధపడేవారికి మంచి మందులా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎసిడిటీతోపాటు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి ఆరోగ్యకరమైన కంటిచూపుకి కూడా సహాయపడతాయి. అలాగే ఎండుద్రాక్షల్లో లభించే ఓలినోలిక్ యాసిడ్ తో పళ్లు బలంగా… ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: మాంసం తినే వారికి షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధి బారిన పడే అవకాశం..?
ఎండు ద్రాక్షల్లో ఐరన్, బీ కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.. అందువల్ల ప్రతిరోజు వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనత దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చు. ఇవి శరీరంలో అనవసరపు కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడతాయి. ఎండుద్రాక్షల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా అవుతాయి..