హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త..?

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ వల్ల మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో మెట్రో ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. అయితే ఎన్ని ఆఫర్లు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం నుంచి మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం అద్భుతమైన ఆఫర్ […]

Written By: Navya, Updated On : October 31, 2020 6:52 pm
Follow us on


కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ వల్ల మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో మెట్రో ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. అయితే ఎన్ని ఆఫర్లు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం నుంచి మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం అద్భుతమైన ఆఫర్ ను ప్రవేశపెట్టారు.

మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఆన్ లైన్ ద్వారా లేదా మెట్రో స్టేషన్లలో స్మార్ట్ కార్డులను రీఛార్జ్ చేసుకుంటే 600 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చని వెల్లడించారు. 50 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.

ప్రయాణికులకు క్యాష్ బ్యాక్ ను స్మార్ట్ కార్డులో జమ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ లో రీఛార్జ్ చేసుకునే వారికి కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో వారికి ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది. అయితే క్యాష్ బ్యాక్ కు షరతులు ఉన్నాయి. ఎవరైతే ఆన్ లైన్ రీఛార్జ్ లేదా మెట్రో స్టేషన్లలో రీఛార్జ్ ద్వారా క్యాష్ బ్యాక్ పొంది ఉంటారో వాళ్లు ఆ క్యాష్ బ్యాక్ ను మూడు నెలల సమయంలోగా వినియోగించుకోవాలని నిబంధనను విధించారు.

ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ వాసులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి ఎక్కువగా మెట్రో పైనే ఆధారపడుతున్నారని.. రోజుకు 1,30,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మెట్రో ప్రయాణికుల కొరకు మెట్రో సువర్ణ ప్యాకేజీ అమలు చేస్తామని దీంతో ప్రయాణికులకు టికెట్ కొనుగోలుపై ఏకంగా 40 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.