రాత్రి వేళ సుఖంగా నిద్రపట్టడం లేదా..? ఇవి తింటే నిద్ర కమ్ముకొస్తుంది..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్ర కరువైంది. ఆఫీసుల్లో పని తర్వాత ఇంటికి వచ్చి కాసేపు పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. అందుకే నిద్ర సుఖమెరగదు అని అలనాటి పెద్దలు అంటుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే నింపాదితననానికి చోటేలేదు. బతకాడానికి డబ్బులు కావాలంటే నిద్రలేచింది మొదలు ఉరుకులు, పరుగులతో ఉద్యోగాలు చేయాల్సిందే అన్న ధ్యాస ఇప్పుడు ఎక్కువైంది. Also Read: కిడ్నీల్లో రాళ్లు పడకుండా ఉండాలంటే ఈ పండు […]

Written By: NARESH, Updated On : October 31, 2020 8:16 pm
Follow us on

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్ర కరువైంది. ఆఫీసుల్లో పని తర్వాత ఇంటికి వచ్చి కాసేపు పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. అందుకే నిద్ర సుఖమెరగదు అని అలనాటి పెద్దలు అంటుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే నింపాదితననానికి చోటేలేదు. బతకాడానికి డబ్బులు కావాలంటే నిద్రలేచింది మొదలు ఉరుకులు, పరుగులతో ఉద్యోగాలు చేయాల్సిందే అన్న ధ్యాస ఇప్పుడు ఎక్కువైంది.

Also Read: కిడ్నీల్లో రాళ్లు పడకుండా ఉండాలంటే ఈ పండు తింటే చాలు..

ఉద్యోగ ఒత్తిడిలు, పని వాతావరణం, డబ్బు సంపాదించాలన్న తొందరలో మనిషికి సగటు నిద్ర కరువైంది.అయితే ఇంత వేగవంతమైన జీవితంలో కూడా పడుకునే ముందు ఒకే రకమైన ఆహార అలవాట్లు ఏర్పరుచుకుంటే హాయిగా నిద్రపోవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. మనిషి నిద్రకు ఉపక్రమించే హార్మోన్ మన ప్రపంచంలో సహజంగా దొరికే ఐదు ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

అరటిపండులో కార్బొహైడ్రేట్స్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి మెదడులోని హార్మోన్స్ ను ఉత్తేజపరుస్తాయి. అంతేకాకుండా తలతిప్పడాన్ని కూడా తగ్గిస్థాయి. ఈ అరటిపండులో మెగ్నీషియం, కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. ఇలా చేయడం వలన సుఖంగా నిద్రపోవచ్చును. నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు వేడిపాలు తాగాలి. ఇవి మెదడు పై ఒత్తిడి పడకుండా చూస్తుంది. శరీరంలోని కాల్షియం కొరత లేకుండా చేసేందుకు ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Also Read: డెలివరీ తర్వాత బరువు పెరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

ఇక రాత్రివేళల్లో ఆకలిగా ఉంటే ఓట్స్ ను ఆహార పదార్థంగా తీసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చును. ఇక వేడిపాలలో తేనె కలుపుకొని తీసుకుంటే ఉదయం లేచిన తరువాత ఉల్లాసంగా ఉంటారు.