Thirst: అధిక దాహం వేస్తుంటే కచ్చితంగా మీరు ఈ వ్యాధుల బారిన పడినట్టేవేస్తుంటే కచ్చితంగా మీరు ఈ వ్యాధుల బారిన పడినట్టే

డీహైడ్రేషన్: శరీరంలో నీటి లోపం ఎక్కువగా ఉంటే, ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం వల్ల సరిపోదు. అందుకే దీని కోసం గొంతును కొద్దికొద్దిగా తడుపుతూ ఉండాలి.. అంటే కొంచెం కొంచెం నీరు తాగాలి అని అర్థం.

Written By: Swathi, Updated On : June 4, 2024 5:49 pm

Thirst

Follow us on

Thirst: ఇన్ని రోజులు విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎక్కువగానే ఎండలు ఉన్నాయి. ఇక వేడి ఎక్కువ ఉన్నప్పుడు బాడీని హైడ్రేటెడ్ ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం కేవలం నీరు త్రాగడమే… వాస్తవానికి శరీరానికి బాగా చెమట పట్టినా లేదా వేడిగా అనిపించినా దాహం తీరడానికి పావు నుంచి అర లీటరు నీరు చాలు అంటారు నిపుణులు. దాహం అనిపించడం సాధారణంగా జరుగుతుంది. అయితే తగినంత నీరు త్రాగిన తర్వాత కూడా దాహం ఆగకపోతే వైద్యులను సంప్రదించాల్సిందే.

ఎక్కువ నీరు తాగినా, పండ్లు, జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ తాగినా సరే కొందరికి దప్పిక వేస్తూనే ఉంటుంది. దీన్ని Polydipsia అంటారు. అయితే.. ఎక్కువ దాహం వేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. దీన్ని నివారించేందుకు ఇది కొన్ని సార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. అయితే ఇలా జరగడానికి అంటే ఎక్కువగా దాహం వేయడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

డీహైడ్రేషన్: శరీరంలో నీటి లోపం ఎక్కువగా ఉంటే, ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం వల్ల సరిపోదు. అందుకే దీని కోసం గొంతును కొద్దికొద్దిగా తడుపుతూ ఉండాలి.. అంటే కొంచెం కొంచెం నీరు తాగాలి అని అర్థం.

పొడి నోరు: చాలా మంది తమ నోటిలో తగినంత మొత్తంలో లాలాజలం ఉత్పత్తి అవదు. దీని కారణంగా నోరు పొడిగా అవుతుంటుంది. దీని వల్ల కూడా పదేపదే నీరు తాగినా సరే దాహం తీరదు.

మధుమేహం: డయాబెటిస్ ఎన్నో వ్యాధులకు మూలంగా మారుతుంటుంది. డయాబెటిక్ రోగుల ప్రధాన సమస్య అధిక దాహం అవుతున్న అనుభూతి చెందుతుంటారు. ఈ సమస్య ఉన్న వారికి పదే పదే నీరు తాగాలి అనిపిస్తుంటుంది.

ఆహార అలవాట్లు: మీరు జంక్ ఫుడ్ లేదా ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా సరే పదే పదే నీరు తాగాలి అనిపిస్తుంటుంది.

రక్తహీనత: శరీరంలో రక్తం లేకపోతే రక్తహీనత సంభవిస్తుంటుంది. హిమోగ్లోబిన్ లోపం ఉంటే.. నీరు తాగినా సరే దాహం అనిపిస్తుంది.