Ramadan: ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో రంజాన్ పండుగ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి ముస్లింలు రోజా పాటిస్తారనే సంగతి తెలిసిందే. ముస్లింలు రంజాన్ మాసం సమయంలో తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోరు. రోజులో ముస్లింలు కనీసం 14 గంటల పాటు ఆహారానికి, మంచినీళ్లకు కూడా దూరంగా ఉంటారు.
నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిలో పెరుగు ఒకటనే సంగతి తెలిసిందే. పెరుగు శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్, క్యాల్షియంలను కలిగి ఉంటుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవాళ్లు సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పాలు తీసుకుంటే మంచిది. పాల ద్వారా శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పళ్ల రసాలను తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి.
సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పుచ్చకాయ, కొబ్బరినీళ్లు తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.