Pregnancy Symptoms: ఈ రోజుల్లో చాలా మందికి సంతాన లేమి సమస్య వేధిస్తోంది. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల సంతానం కూడా ఆలస్యమవుతుంది. దీంతో ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. చాలా దేశాలు పిల్లల్ని కనే వారికి ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. చైనాలో ఇదివరకు ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అని ప్రచారం చేసింది. దీనివల్ల అక్కడ జనాభా తగ్గిపోయింది. మన జనాభా ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశంగా అవతరించింది.
గర్భం దాల్చారని తెలియజేసే సంకేతాలు కొన్ని ఉంటాయి. దీంతో ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిందనడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. సమయానికి వచ్చే పీరియడ్స్ ఆగిపోవడం, ఛాతీలో మార్పులు రావడం జరుగుతుంది. ఇలాంటివి మనకు కనిపిస్తే గర్భం వచ్చినట్లు దాఖలైనట్లే. ఇలా ఆడవారికి కొన్ని గుర్తులు గర్భం వచ్చిందని చెప్పడానికి ఆనవాళ్లుగా నిలుస్తాయి.
పదేపదే మూత్రం రావడం, వజైనల్ డిశ్చార్జి చిక్కగా కావడం కూడా జరుగుతుంది. ఆడవారికి గర్భం దాల్చే సమయంలో కొన్ని రకాల చర్యల వల్ల తెలియజేస్తుంది. శరీరంలో మార్పులు సంభవిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు మారుతాయి. ఇలా పలు రకాల క్రియలు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిపే ఆనవాళ్లు కనిపించడం మామూలే. దీంతో ప్రెగ్నెన్సీ గురించి సందేహాలు అక్కర్లేదు.
బాగా ఆకలి వేయడం లేదా ఆకలి వేయకపోవడం లక్షణాలు కూడా కనిపిస్తాయి. నీరసం, వాంతులు, వికారం తరచుగా వస్తుంటాయి. కొన్ని ఆహార పదార్థాలు నచ్చకపోవడం జరుగుతుంది. ఇలా గర్భం దాల్చడానికి కావాల్సిన లక్షణాలు ఆడవారిలో కనిపిస్తే ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కన్ఫమ్ అయ్యాక ఆహార అలవాట్లు మార్చుకోవాలి.