Night Food : ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాత్రి పూట తీసుకునే ఆహారంలో మనం ఎన్నో రకాలుగా ఆలోచించాలి. ఎందుకంటే రాత్రి మనం తీసుకునే ఆహారం బాగుండాలి. లేకపోతే జీర్ణ సంబంధమైన సమస్యలు రావడం సహజం. రాత్రి ఎక్కువగా భోజనం తీసుకుంటే నిద్రపై ప్రభావం పడుతుంది. మసాలాలు, కారం, ఉప్పు ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండటమే మంచిది. లేకపోతే కడుపులో మంట, గ్యాస్, జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి.
రాత్రిపూట హెవీ ఫుడ్స్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. రాత్రి సమయంలో ఫిజాలు, బర్గర్లు, మాంసాహారాలు తింటే త్వరగా జీర్ణం కావు. ఫలితంగా మనకు నిద్ర సరిగా పట్టదు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే తేలిగ్గా అరిగే ఆహారాలు తీసుకుంటేనే మంచిది. నిద్ర బాగా పడుతుంది. హాయిగా ఉంటుంది.
కూల్ డ్రింక్స్, కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు. ఇందులో కెఫిన్ మెదడుకు ఉత్తేజం తీసుకొస్తుంది. ఫలితంగా మనకు నిద్ర పట్టదు. అందుకే ఇలాంటి సాయంకాలం పూట పెట్టుకోవద్దు. గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. దీంతో వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. లేకపోతే శరీరానికి ఇబ్బందులు రావడం గ్యారెంటీ. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు.
రాత్రి సమయంలో స్వీట్లు తినడం కూడా కరెక్టు కాదు. ఇందులో చక్కెర అధికంగా ఉండటం వల్ల ఇది రక్తంలో షుగర్ నిల్వలు పెంచుతుంది. తద్వారా మనకు సరిగా నిద్ర పట్టకుండా చేస్తుంది. దీంతో గ్యాస్ట్రిక్, ఎసిడిటి సమస్యలు వస్తాయి. ఇలా మనం రాత్రి పూట తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు నష్టాలే ఎక్కువ.