https://oktelugu.com/

Hansika : టాలీవుడ్ స్టార్ హీరోపై హన్సిక షాకింగ్ కామెంట్స్… లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు!

గతంలో ఓ టాలీవుడ్ హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు. అస్తమానం డేట్ కి వెళదామా అని వేధించేవాడు. ఆ హీరోకి నేను తగిన బుద్ధి చెప్పాను, అని అన్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 23, 2023 / 06:05 PM IST
    Follow us on

    Hansika : చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన హన్సిక మోత్వానీ దేశముదురు మూవీతో హీరోయిన్ అయ్యింది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. దేశముదురు చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా ఆమె నటించారు. ఆమె క్యూట్నెస్, బ్యూటీ నచ్చడంతో స్టార్స్ కూడా వెంటపడ్డారు. కంత్రీ మూవీలో ఎన్టీఆర్ తో జతకట్టింది. ప్రభాస్ కి జంటగా బిల్లా చేసింది. తెలుగులో ఆమె రామ్, నితిన్, కళ్యాణ్ రామ్, విష్ణు వంటి హీరోలతో జతకట్టారు. 
     
    తాజాగా ఆమె టాలీవుడ్ పై చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఓ హీరో తనను వేధింపులకు గురి చేసినట్లు ఆమె ఆవేదన చెందారు. హన్సిక మాట్లాడుతూ… గతంలో ఓ టాలీవుడ్ హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు. అస్తమానం డేట్ కి వెళదామా అని వేధించేవాడు. ఆ హీరోకి నేను తగిన బుద్ధి చెప్పాను, అని అన్నారు. ఆ హీరో ఎవరన్నది మాత్రం హన్సిక స్పష్టంగా చెప్పలేదు. దీంతో సస్పెన్సు కొనసాగుతోంది. అదే సమయంలో జనాలు హన్సికతో సినిమాలు చేసిన హీరోల లిస్ట్ బయటకు తీసి ఆరా తీస్తున్నారు. 
     
    తెలుగులో సినిమాలు చేస్తూ చేస్తూనే హన్సిక కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు తెలుగు చిత్రాలు చేసినా పూర్తి దృష్టి కోలీవుడ్ పై పెట్టింది. అందుకు హీరో వేధింపులు కూడా కారణం కావచ్చు. కాగా కోలీవుడ్ కి వెళ్ళాక అక్కడ హీరో శింబుతో హన్సిక ఎఫైర్ పెట్టుకుంది. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ఆది ముగిసిన బంధం అని ఓ సందర్భంలో శింబుతో ఎఫైర్ పై ఆమె స్పందించారు. 
     
    గత ఏడాది హన్సిక వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇది రెండో వివాహం. పెళ్లి తర్వాత కూడా హన్సిక కెరీర్ కొనసాగిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాల వరకూ చేస్తున్నారు. వాటిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నట్లు సమాచారం. హన్సిక తెలుగులో నటించిన చివరి చిత్రం తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్. సందీప్ కిషన్ హీరోగా నటించారు.