Diabetes Diet: ఇటీవల కాలంలో అందరిని కలవరపెడుతున్న రోగం మధుమేహం. దీన్ని షుగర్, చక్కెర అని పిలుస్తుంటారు. ఇది వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే చాలా మందిని కబళించింది. భవిష్యత్ లో ఇంకా వేగంగా విస్తరించనుంది. అసలు షుగర్ ఎందుకు వస్తుంది? ఏ పొరపాట్లు చేస్తే మనల్ని ఆవహిస్తుంది. అది రావడానికి కారణాలంటే? షుగర్ ఎక్కువగా అన్నం తినే వారిలో ఉటుంది. మనం తిన్న అన్నం జీర్ణం కాకపోతే దాన్ని గ్లూకోజ్ గా మారుస్తుంది. అది పెరిగి చక్కెరగా మారుతుంది. ఇలా షుగర్ మనల్ని తాకుతుంది. ఇందులో టైపు 1, టైపు 2 ఉంటాయి. టైపు 1 అంటే చిన్న వయసులో వచ్చేది. టైపు 2 అంటే వయసు వచ్చాక వచ్చేది. దీంతో వీటిని వదిలించుకోవాలంటే చాలా కష్టపడాలి.
షుగర్ వస్తే ఏం తినాలి?
షుగర్ వస్తే ధాన్యాలు తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, నట్స్, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటితో మనకు మంచి బలం ఉంటుంది. అన్నం తినడం మానేయాలి. లేకపోతే షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి. దీంతో విపరీత అనర్థాలు చోటుచేసుకుంటాయి. అందుకే షుగర్ వ్యాధి గ్రస్తులు డైట్ ను జాగ్రత్తగా ఫాలో కావాలి. నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతి.
ఏం తినకూడదు
స్వీట్లకు దూరంగా ఉండాలి. తియ్యని పండ్లు తినకూడదు. అందులో మామిడి, సీతాఫలం, సపోటా, అరటి వంటి పండ్ల జోలికి వెళ్లకపోవడమే బెటర్. సాధ్యమైనంత వరకు అన్నం మానేయాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. సమయానికి మందులు వేసుకుంటూ వైద్యులను సంప్రదించి ఎప్పటికప్పుడు పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.
ఎలా ఉండాలి?
రోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయాలి. వ్యాయామం అలవాటు చేసుకోవాలి. యోగా చేస్తే ఇంకా మంచిది. ఇలా మన దినచర్య రూపొందించుకోవాలి. క్రమం తప్పకుండా ఫాలో కావాలి. అప్పుడే మన శరీరం అదుపు తప్పకుండా ఉంటుంది. రోజువారి దినచర్య కచ్చితంగా అమలు చేయాలి. మంచి ఆహారం, వ్యాయామం, అలవాట్లు ఉంటే కచ్చితంగా షుగర్ అదుపులో ఉండటం ఖాయం.
ఏవి షుగర్ ను కట్టడి చేస్తాయి
షుగర్ ఉన్న వారు బెండకాయ కూర వారంలో కనీసం రెండు సార్లు తినాలి. దీంతో రక్తంలో చక్కెర తక్కువ అవుతుంది. వెల్లుల్లి షుగర్ కు మంచి మందులా పనిచేస్తుంది. రోజు రెండు మూడు రెబ్బలు పచ్చివి తిన్నా షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు. రాత్రి పూట మెంతులు నానబెట్టి ఉదయాన్నే వాటిని తింటే షుగర్ నియంత్రణలోకి రావచ్చు. దాల్చిన చెక్క కూడా షుగర్ కు మంచి మందు. రోజుకు ఓ రెండు చెక్కలు నోట్లో వేసుకుని నములుతుండాలి. బ్రోకలీ కూడా షుగర్ కు కళ్లెం వేస్తుంది. దీన్ని కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More