Stress: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం రీత్యా కొన్ని పనుల కారణంగా మానసిక ఆందోళనలతో ఉండడం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. అయితే ఎలాంటి పని అయినా ఈజీగా చేసుకునే అలవాటు ఉండటంవల్ల మానసికంగా కొంత భారాన్ని తగ్గించుకున్న వారవుతారు. అంటే కొన్ని రకాల పనులను పక్కన పెడుతూ.. మరికొన్నింటిని సులభంగా చేసుకునే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. దీంతో ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మానసికంగా ఒత్తిడిగా ఉండడం వల్ల గుండెపోటుతో పాటు బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడతాయి. అయితే ఒత్తిడి నుంచి దూరం కావాలంటే ఏం చేయాలి?
ధ్యానం:
ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో రకాల పనుల్లో మునిగిపోతూ ఉంటారు. దీంతో మనసు కు విరామం దొరకకుండా ఉండిపోతుంది. అందువల్ల మనసుపై భారం పడి శరీరంపై కూడా ఆ ప్రభావం చూపుతుంది. అయితే మనసుకు కాస్త విశ్రాంతి ఇవ్వడం వల్ల శరీరం కూడా అనుకోకుండా రిలాక్స్ అవుతుంది. ఇందుకోసం రోజు కనీసం 30 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ప్రశాంతమైన వాతావరణం లో పద్మాసనం వేసి కూర్చొని 30 నిమిషాల పాటు ఎలాంటి ఆలోచనలు లేకుండా శ్వాస బిగబడుతూ వదిలి వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి దూరమయ్యే అవకాశం ఉంది.
అనవసర పనులకు దూరం:
రోజు ఏదో ఒక పని చేస్తేనే కొన్ని అవసరాలు తీరుతాయి. అయితే అవి తప్పవు గనుక కాస్తా కష్టపడాలి. కానీ కొన్ని అవసరంలేని పనులను కూడా చేయడం వల్ల మనసుపై అధిక భారం పడుతుంది. అందువల్ల కొన్ని అనవసరపు పనులకు దూరంగా ఉండాలి. నచ్చని పనులను కొందరు చేయమని బలవంతం పెడితే వాటికి నిరభ్యంతరంగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇష్టం లేని పనులు చేయడం వల్ల ఒత్తిడి తీవ్రమవుతుంది.
రోజు కాసేపు నవ్వు:
ఇప్పుడున్న కాలంలో చాలామందిలో నవ్వు దూరమైందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉండిపోవడం వల్ల నవ్వెందుకు ఆస్కారం ఉండడం లేదు. అయితే రోజు ఒకసారి నవ్వడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది. ఇందుకోసం ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఉండడం లేదా మనసుకు హాయిగా ఉండే వీడియోలు చూడడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా నవ్వెందుకు ఆస్కారం ఉండే ప్రదేశాలకు వెళుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి మటుమాయం అయిపోతుంది.
ఇష్టమైన వ్యక్తులతో కలిసి:
కొందరికి ఎంతో మంది స్నేహితులు ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ఇష్టంగా ఉంటారు. అలాంటి వారితోనే రోజు కలిసి మాట్లాడడం.. కొన్ని విషయాల్లో పంచుకోవడం చేయాలి. అలా కాకుండా ఎప్పటికీ నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల మనసు ఆందోళనగా మారుతుంది. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండి మనసు కు నచ్చే వారితో ఉండడం వల్ల ఒత్తిడి ఉండకుండా ఉంటుంది. అంతేకాకుండా వీరితో పర్సనల్ విషయాలను కూడా పంచుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.