https://oktelugu.com/

మీలో ఈ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా.. ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టే..?

కరోనా మహామ్మారి గడిచిన 10 నెలల నుంచి దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేయడంతో పాటు ప్రజల్లో కొత్త ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దేశంలో కోటికి పైగా కరోనా కేసులు నమోదు కాగా చాలామంది వైరస్ నుంచి కోలుకున్నా వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంతమందికి కరోనా నెగిటివ్ వచ్చినా మళ్లీ కొన్ని రోజుల తరువాత పాజిటివ్ నిర్ధారణ అవుతూ ఉండటం గమనార్హం. అయితే శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2021 / 05:55 PM IST
    Follow us on


    కరోనా మహామ్మారి గడిచిన 10 నెలల నుంచి దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేయడంతో పాటు ప్రజల్లో కొత్త ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దేశంలో కోటికి పైగా కరోనా కేసులు నమోదు కాగా చాలామంది వైరస్ నుంచి కోలుకున్నా వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంతమందికి కరోనా నెగిటివ్ వచ్చినా మళ్లీ కొన్ని రోజుల తరువాత పాజిటివ్ నిర్ధారణ అవుతూ ఉండటం గమనార్హం.

    అయితే శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల ద్వారా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే మాత్రమే కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇమ్యూనిటీని బట్టి కరోనా బాధితులకు మళ్లీ వైరస్ సోకుతుందో లేదో చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    కరోనా నుంచి కోలుకున్న వారిలో గరిష్టంగా ఆరు నెలలు యాంటీబాడీలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లక్షణాలు కనిపించని, తక్కువ కరోనా లక్షణాలు ఉన్నవారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు పదేపదే జ్వరం వస్తున్నా, ఆకలి మందగించినా ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టేనని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఎక్కువగా డయేరియా బారిన పడుతున్నారు. కోలుకున్న మరి కొంతమందిలో పొత్తికడుపులో నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.