Summer Health Tips: వేసవిలో తాపం నుంచి ఈ జ్యూస్ లతో బయటపడండి.

ద్రాక్ష రసం.. ద్రాక్ష రసం చేయడానికి కొన్ని కడిగిన ద్రాక్షలను తీసుకొని వాటిని గ్రైండర్ లో వేయండి. అందులో కొంచెం పంచదార, పుదీనా ఆకులు, నల్ల ఉప్పు వేసి నీరు కలపండి.

Written By: Swathi, Updated On : April 24, 2024 4:59 pm

Summer Health Tips

Follow us on

Summer Health Tips: వేసవిలో నీరు ఎక్కువగా తాగుతుంటారు. ఎంత నీరు తాగిన ఆ తాపం మాత్రం తీరదు. ఇక చల్లచల్లగా జ్యూస్ లను కూడా తాగాలి అనిపిస్తుంటుంది. ఇంతకీ మీకు జ్యూస్ లను తయారు చేసుకోవడం తెలుసా? ఇప్పుడు మనం కొన్ని జ్యూస్ లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రసాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందులో కొన్ని పదార్థాలు కలిపితే మరింత మేలు జరుగుతుంది మరి ఆలస్యం ఎందుకు చదివేసేయండి.

ద్రాక్ష రసం.. ద్రాక్ష రసం చేయడానికి కొన్ని కడిగిన ద్రాక్షలను తీసుకొని వాటిని గ్రైండర్ లో వేయండి. అందులో కొంచెం పంచదార, పుదీనా ఆకులు, నల్ల ఉప్పు వేసి నీరు కలపండి. ఇప్పుడు మిక్స్ చేసి ఆ తర్వాత స్ట్రైనర్ సహాయంలో ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. ఈ జ్యూస్ కు కొంచెం ఐస్, చల్లని నీరు వేసి బాగా కలిపితే చాలు. కావాలంటే కాస్త నిమ్మరసం కూడా కలిపి తాగవచ్చు. ఇది వేసవిలో శరీరానికి చాలా మేలు చేస్తుంది.

పచ్చిమామిడి రసం.. పుల్లని మామిడి కాయను తీసుకొని.. పొట్టు తీసి ముక్కలుగా చేసి గ్రైండర్ లో మెత్తగా గ్రైండ్ చేయండి. దీని తర్వాత కొత్తిమీర తరుగు, పుదీనా, నల్ల ఉప్పు, పంచదార, వేయించిన జీలకర్ర పొడి వేసి గ్రైండ్ చేయండి. దీన్ని పాత్రలో వేసి బాగా ఫిల్టర్ చేయండి. దీనికి ఐస్ లేదా చల్లటి నీరు కలిసి తాగితే వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

దోసకాయ జ్యూస్.. దోసకాయ జ్యూస్ కూడా వేసవిలో మంచి ఉపశమనం ఇస్తుంది. దీని కోసం ఒకటి రెండు దోసకాయలను కడిగి చిన్న ముక్కలుగా చేసి గ్రైండర్ లో మొత్తగా రుబ్బాలి. ఇందులో చిన్న అల్లం ముక్కలు తీసుకొని అందులోని కొంచెం నల్ల ఉప్పు, నిమ్మకాయ, పుదీనా, పంచదార, చల్లటి నీరు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత స్ట్రైనర్ సహాయంలో ఫిల్టర్ చేసుకొని తాగండి.

కలబంద జ్యూస్ పుచ్చకాయ రసాలు కూడా వేడి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇలా ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ జ్యూస్ లను తాగండి. తాగడానికి ఇష్టంగా, చల్లగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రోజుకు ఒక రకం జ్యూస్ చేసుకొని తాగేసేయండి.