https://oktelugu.com/

Heart Attack: హార్ట్ ఎటాక్ వచ్చిందా? ముందుగా ఇలా ప్రథమ చికిత్స చేయండి..

గుండెనొప్పి వచ్చిందనే అనుమానం ఉంటే వెంటనే సార్బిట్రేట్ అనే టాబ్లెట్ తీసుకొని నాలుక కింద పెట్టుకోవాలి. టాబ్లెట్ పెట్టుకున్న 5 నిమిషాలలోపు నొప్పి తగ్గితే అది గుండెనొప్పి అనుకోవాలి.

Written By:
  • Vicky
  • , Updated On : April 24, 2024 / 04:53 PM IST

    Heart Attack

    Follow us on

    Heart Attack: ప్రస్తుత రోజుల్లో గుండె సమస్యలు సర్వసాధారణంగా వస్తున్నాయి. ప్రతి వయసు వారికి కూడా ఈ సమస్య కామన్ గా మారింది. యుక్త వయసు, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా గుండె సమస్యలు వస్తున్నాయి. ఇక గుండె నొప్పి కూడా కామన్ గా వస్తుంది. అయితే గుండె నొప్పి వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్తుంటారు. కానీ దానికి ముందే చేయాల్సిన చికిత్స గురించి తెలుసుకుందాం.

    గుండెనొప్పి వచ్చిందనే అనుమానం ఉంటే వెంటనే సార్బిట్రేట్ అనే టాబ్లెట్ తీసుకొని నాలుక కింద పెట్టుకోవాలి. టాబ్లెట్ పెట్టుకున్న 5 నిమిషాలలోపు నొప్పి తగ్గితే అది గుండెనొప్పి అనుకోవాలి. కానీ ఈ నొప్పికి ఇంట్లో చికిత్స చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకొని వెళ్లాలి. అంబులెన్స్ లో గుండె నొప్పి ప్రథమ చికిత్సకు కావాల్సిన పరికరాలు ఉంటాయి. వ్యక్తి గుండెకు సమస్య వస్తే ఆగిపోయే అవకాశాలు ఉంటే అతడిని నేల మీద పడుకోబెట్టాలి. చుట్టూ జనం ఉండకుండా చూసుకోవాలి.

    అతని గుండె మీద ఒక చేతిని పెట్టి ఆ చేతి మీద మరొక చేతిని పెట్టి గుండెకు ముందు వైపున ఉండే ఎముక మీద బరువు అంతా పెట్టి నిలబడి గట్టిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల గుండె ఒత్తిడికి గురయ్యే గుండె నుంచి రక్తం పారుతుంది. ఇలా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలు అవుతుంది. దీన్ని సీసీఆర్ అంటారు.

    గుండె నొక్కుతూనే మధ్యలో నోట్లోకి గాలి కూడా ఊదుతూ ఉండాలి. ఇక గాలి ఊదేటప్పుడు కర్చీఫ్ పెట్టుకొని ఊదటం మంచిది. షుగర్ ఉన్నవారికి ఈ నొప్పి అంతగా ఉండదు అంటున్నారు నిపుణులు. ఇక ఆసుపత్రిలో మందుని ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. దీని వల్ల కరొనరీ ధమనుల్లో ఉన్న రక్తం గడ్డ కరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదా సో గుండె నొప్పి వచ్చినప్పుడు కాస్త ప్రథమ చికిత్స చేయండి. లేదంటే వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయండి.