https://oktelugu.com/

నిద్ర తక్కువైతే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే..?

దేశంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. నిద్రలేమి సమస్యను కొంతమంది తేలికగాభావించినప్పటికీ నిద్రలేమి వల్ల మనల్ని ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రపంచంలోనే నిద్ర తక్కువైన దేశాల్లో మన దేశం రెండో దేశం కావడం గమనార్హం. నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రించే సమయంలో శరీరం వ్యర్థాలను తొలగించుకోవడంతో పాటు అవసరమైన హార్మోన్లను తయారు చేసుకుంటుంది. పిల్లలు, యుక్త వయస్కుల్లో నిద్రించే సమయంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 8, 2021 5:01 pm
    Follow us on


    దేశంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. నిద్రలేమి సమస్యను కొంతమంది తేలికగాభావించినప్పటికీ నిద్రలేమి వల్ల మనల్ని ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రపంచంలోనే నిద్ర తక్కువైన దేశాల్లో మన దేశం రెండో దేశం కావడం గమనార్హం. నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రించే సమయంలో శరీరం వ్యర్థాలను తొలగించుకోవడంతో పాటు అవసరమైన హార్మోన్లను తయారు చేసుకుంటుంది.

    పిల్లలు, యుక్త వయస్కుల్లో నిద్రించే సమయంలో గ్రోత్ హార్మోన్ రిలీజవుతుంది. సరిగ్గా నిద్ర లేకపోతే ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. తగినంత నిద్ర ఉంటే మాత్రమే ఏకాగ్రత, విషయగ్రహణ శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కనీసం ఏడు గంటలు కచ్చితంగా నిద్రపోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. త్వరగా పడుకుని త్వరగా నిద్ర లేస్తే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    కొంతమంది రాత్రి సమయంలో చురుకుగా పని చేసి పగలు నిద్రపోతూ ఉంటారు. జన్యుపరమైన, ఆరోగ్య సమస్యలు కూడా ఇందుకు కారణమవుతాయి. అలాంటి సమయంలో వైద్యుల సూచనలను పాటించి చికిత్స చేయించుకుంటే మంచిది. రోజుల తరబడి నిద్రపోకుండా ఉంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. 17 గంటలు ఏకబిగిన నిద్రపోకుండా ఉంటే ఆలోచనా శక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి.

    నిద్ర తగ్గితే ఆయుష్షు తగ్గడంతో పాటు శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి 70 శాతం వరకు తగ్గుతుంది. తక్కువ సమయం నిద్రపోతే ఆకలి పెరగడంతో పాటు బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. నిద్ర తగ్గితే రక్తపోటు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. పడుకునే ముందు అరటిపండ్లు, పాలు తీసుకుంటే త్వరగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.