https://oktelugu.com/

Red Rice: రెడ్ రైస్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. బానపొట్ట సైతం కరిగేలా?

Red Rice: ప్రస్తుత కాలంలో అధిక బరువు వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది బాధ పడుతున్నారు. ఆహారపు అలవాట్ల వల్లే ఎక్కువమంది బరువు పెరుగుతున్నారని తెలుస్తోంది. ప్రజలలో ఎక్కువమంది వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఆహారంగా తీసుకుంటుండగా కొన్ని ప్రాంతాల్లో రెడ్ రైస్ కూడా అందుబాటులో ఉంది. రెడ్ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడానికి ఆసక్తి చూపేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఎర్ర బియ్యంలో ఆంథోసయనిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ పుష్కలంగా ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2021 / 05:37 PM IST
    Follow us on

    Red Rice: ప్రస్తుత కాలంలో అధిక బరువు వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది బాధ పడుతున్నారు. ఆహారపు అలవాట్ల వల్లే ఎక్కువమంది బరువు పెరుగుతున్నారని తెలుస్తోంది. ప్రజలలో ఎక్కువమంది వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఆహారంగా తీసుకుంటుండగా కొన్ని ప్రాంతాల్లో రెడ్ రైస్ కూడా అందుబాటులో ఉంది. రెడ్ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడానికి ఆసక్తి చూపేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

    Red Rice

    ఈ ఎర్ర బియ్యంలో ఆంథోసయనిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసమైన పోషకాలు ఈ బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. ఈ రైస్ ద్వారా శరీరానికి అవసరమైన పీచు, ఐరన్, ఇతర పోషకాలు లభిస్తాయి. రెడ్ రైస్ నిదానంగా జీర్ణమవుతుంది. రెడ్ రైస్ లో పీచుశాతం ఎక్కువగా ఉంటుంది. చైనా సంప్రదాయ వైద్యంలో ఈ రెడ్ రైస్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

    Also Read: చింతపండు నీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

    విటమిన్‌ బి1, బి2తో పాటు జింక్‌, పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్, రెడ్ రైస్ ద్వారా లభిస్తాయి. ఈ రైస్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మొనాకొలిన్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గించడంలో ఈ రైస్ తోడ్పడుతుంది. ఈ రైస్ లో ఉండే క్యాల్షియం, మాంగనీస్ ఎముకల్ని బలంగా ఉంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. షుగర్ పేషెంట్స్, గుండె వ్యాధులతో బాధ పడేవాళ్లు ఎర్రబియ్యం ఆహారంగా తీసుకుంటే మంచిది.

    మధుమేహం ఉన్నవాళ్లు కూడా ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకొని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే మాంగనీస్ ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. రెడ్ రైస్ ను రోజూ తీసుకుంటే బాన పొట్ట కూడా తగ్గుతుంది.

    Also Read: మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ బీరువా ఇలా ఉండాల్సిందే!