చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చేపలు తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతూ ఉంటారు. తినడానికి రుచిగా ఉండే చేపలు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. చేపలు ఎక్కువగా తినడం వల్ల కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి, ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలను సైతం పొందవచ్చు. మన శరీరానికి అవసరమైన నాణ్యమైన మాంసకృత్తులు చేపలలో పుష్కలంగా ఉంటాయి. Also Read: కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? జింక్, అయోడిన్, మెగ్నీషియం, ఐరన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 27, 2020 3:05 pm
Follow us on


శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చేపలు తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతూ ఉంటారు. తినడానికి రుచిగా ఉండే చేపలు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. చేపలు ఎక్కువగా తినడం వల్ల కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి, ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలను సైతం పొందవచ్చు. మన శరీరానికి అవసరమైన నాణ్యమైన మాంసకృత్తులు చేపలలో పుష్కలంగా ఉంటాయి.

Also Read: కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

జింక్, అయోడిన్, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఖనిజాలను సైతం చేపల ద్వారా సులభంగా పొందవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేపలను తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు శరీరంలో కొవ్వును అదుపులో ఉంచడంలో సైతం సహాయపడతాయి. చేపలు శరీర నిర్మాణంలో సైతం కీలక పాత్రను పోషిస్తాయి. చాలామంది వయస్సు పెరిగే కొద్దీ మతిమరపు సమస్యతో బాధ పడుతూ ఉంటారు.

Also Read: బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదా.. ఆ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..?

అయితే తరచూ చేపలను తీసుకునే వారికి మతిమరపు సమస్య దూరమవుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ చేపలు ఎక్కువగా తినేవాళ్లు గుండె జబ్బుల బారిన తక్కువగా పడతారని వెల్లడించింది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి. చేపల ద్వారా వచ్చే డోపమైన్, సెరొటోనిన్ హార్మోన్లు ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

తరచూ చేపలను తినేవాళ్లలో కంటిసంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించడంలో చేపలు ఎంతగానో సహాయపడతాయి. తరచూ చేపలు తింటే స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.