పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలో తెలుసా..?

హిందువులు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పండితులు కార్తీకమాసం శివరాత్రితో సమానం అని చెబుతూ ఉంటారు. వెయ్యి సంవత్సరాల అసుర పాలన అంతమైన సందర్భంగా శివుడు తాండవం చేసిన రోజును కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకమాసంలో చేసే ఉపవాసాలు, ధ్యానం, జపం, దానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. Also Read: బంగారం ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం ధరలు..? శివకేశవులకు కార్తీక పౌర్ణమి ప్రీతిపాత్రమైన రోజు. కార్తీకపౌర్ణమి […]

Written By: Navya, Updated On : November 27, 2020 3:01 pm
Follow us on

హిందువులు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పండితులు కార్తీకమాసం శివరాత్రితో సమానం అని చెబుతూ ఉంటారు. వెయ్యి సంవత్సరాల అసుర పాలన అంతమైన సందర్భంగా శివుడు తాండవం చేసిన రోజును కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకమాసంలో చేసే ఉపవాసాలు, ధ్యానం, జపం, దానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

Also Read: బంగారం ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం ధరలు..?

శివకేశవులకు కార్తీక పౌర్ణమి ప్రీతిపాత్రమైన రోజు. కార్తీకపౌర్ణమి రోజున సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కాబట్టి 365 ఒత్తులను జత చేసి ఆ ఒత్తులను ఆవు నెయ్యిలో పెట్టి తులసి చెట్టు దగ్గర కానీ, దేవాలయం దగ్గర కాని వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగిస్తే మనం గతంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.

Also Read: వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

కారీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే మరీ మంచిది. శివాలయంలో కారీక పౌర్ణమి రోజు దీపారాధాన చేస్తే ముక్కోటి దేవతలను పూజిస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున కేదాశ్వర వ్రతం చేస్తే ముక్కోటి దేవతల పూజాఫలం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున వీలైతే నదిలో స్నానం చేయడం మంచిది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం: అత్యంత ప్రజాదరణ

తలస్నానం చేసిన తరువాత దేవుడిని తప్పనిసరిగా సందర్శించుకోవాలి. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేయడం ఏ పని చేసినా మంచే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీపారాధన వల్ల జీవించినంత కాలం సుఖసుఖ్యాలు, చనిపోయిన తరువాత ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.