Sitting job side effects: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, వ్యాపారం కారణంగా శారీరక శ్రమ కంటే కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత కూర్చున్న చోటే అన్ని పనులు చక్కబెడుతున్నారు. ఒకరకంగా అభివృద్ధిలో ఇది సమంజసమే అయినా కూడా శారీరకంగా మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించిన వారు తమ శరీరాన్ని కదలిక లేకుండా చేస్తున్నారు. రోజులు గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల కొందరు ప్రముఖ వైద్యులు తెలుపుతున్న ప్రకారం రోజుకు 8 గంటలు కూర్చొని పనిచేసేవారు స్మోకింగ్ చేసే వారి కంటే డేంజర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల ఏం జరుగుతుంది? ఈ సమస్యల నుంచి బయట పడాలంటే ఏం చేయాలి?
మానవ శరీరం ప్రతిరోజులో 8 గంటలు ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కొంతవరకు అయినా శారీరక శ్రమ ఉండడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలా గంటల తరబడి శరీరం కదలిక లేకుండా కూర్చుని పనిచేయడం వల్ల రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్త ప్రసరణ లో ఇబ్బందులు ఏర్పడితే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల లిపో ప్రోటీన్ లిపేజ్ అనే ముఖ్యమైన ఎంజాయ్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది కొవ్వను కరిగించడంలో సహాయపడుతుంది. దీని ఉత్పత్తి ఆగిపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీర్ఘకాలికంగా కూర్చొని పనిచేసే అలవాటు ఉన్నవారిలో కండరాలు చురుగ్గా పనిచేయకుండా పోతాయి దీంతో శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరిగ్గా ఉపయోగపడకుండా ఉంటుంది. ఇది టైప్ టు డయాబెటిస్ కు ప్రధాన కారణం అవుతుంది. దీని నుంచి కుండ జాబు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే రోజుకు 8 గంటల పాటు కదలిక లేకుండా కూర్చొని పనిచేసే వారిలో గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణ శారీరక శ్రమ కలిగిన వ్యక్తుల కంటే వీరి ఆయుష్షు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని ప్రముఖ డాక్టర్ వర్మ హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా కూర్చొని పనిచేసేవారు ప్రతిరోజు గంటసేపు వ్యాయామం చేసినా కూడా తక్కువే అని అంటున్నారు.
విధుల కారణంగా ఇలా గంటల తరబడి కూర్చొని పనిచేసేవారు ప్రతిరోజు కొన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి లేచి రెండు నిమిషాలు నడవాలి. ఆఫీసులో పనిచేసేవారు స్టాండింగ్ డెస్క్ ఉపయోగించుకోవాలి. ఫోన్లో మాట్లాడేటప్పుడు నడుస్తూ ఉండాలి. రోజుకు 7 నుంచి 10000 అడుగుల వరకు నడిచేలా చూసుకోవాలి. లిఫ్ట్ కంటే మెట్లను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మొత్తంగా కూర్చొని పనిచేసేవారు స్మోకింగ్ చేసే వారి కంటే ఎక్కువగా ఇబ్బందులకు గురై అవకాశముంది. అయితే చిన్న చిన్న వ్యాయామాలతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.