Eating Empty Stomach : రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయాన్నే తీసుకునే ఫడ్ చాలా ముఖ్యమైనది. ఆరోగ్యమైన ఆహారాలను మాత్రమే పొద్దున్న తినాలి. కొందరు ఉదయం పూట అన్నిరకాల ఆహార పదార్థాలను తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కొన్ని ఈ ఏడు ఆహార పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏడు పదార్థాలను అసలు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఉదయం పూట ఆరోగ్యానికి హాని చేసే వాటిని తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. కాస్త అలసట, చిరాకుగా ఉంటుంది. పోషకాలు ఉండే సరైన ఫుడ్‌ను ఉదయం పూట తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు యాక్టివ్‌గా రోజంతా పనిచేస్తారు. మరి ఉదయం పూట ఖాళీ కడుపుతో తినకూడని ఆహార పదార్థాలేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లను పరగడుపున తీసుకోకూడదు. వీటిని తినడం వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. సిట్రస్ జాతి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే వీటిని ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు. ఇందులోని ఆమ్లం వల్ల వీటిని ఉదయం పూట తింటే కడుపులో యాసిడ్ పెరుగుతుంది.
కాఫీ
చాలామంది బెడ్ కాఫీ తాగుతుంటారు. కప్పు కాఫీ లేకపోతే వారికి అసలు రోజు ప్రారంభం కాదు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే అంత మంచిది కాదు. కాఫీలో ఉండే కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.
పానీయాలు
ఉదయం పూట చక్కెర ఉండే పానీయాలు తాగకూడదు. ఇలా తీసుకోవడం వల్ల రోజంతా అలసటగా ఉంటుంది. ఏ పనిని కూడా సరిగ్గా చేయలేరు. కాబట్టి ఉదయం పూట చక్కెర ఉండే పదార్థాలకు కాస్త దూరంగా ఉండండి.
పచ్చి కూరగాయలు
పరగడుపున చాలా మంది పచ్చి కూరగాయల రసం తాగుతారు. ఇందులో అధిక మొత్తంలో పీచు ఉంటుంది. పీచు ఆరోగ్యానికి మంచిదే. కానీ ఉదయం పూట తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కాబట్టి ఉదయం పూట ఇలాంటి జ్యూస్‌లు తాగవద్దు.
మసాలా ఫుడ్స్
ఖాళీ కడుపుతో మసాలా ఫుడ్స్ అసలు తినకూడదు. అధికంగా మసాలా ఉండే బిర్యానీ వంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
అరటి పండ్లు
ఈ పండ్లులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకి రెండు నుంచి మూడు అరటి పండ్లు తినడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. అయితే ఇందులో మెగ్నీషియం ఉంటుంది. వీటిని పరగడుపున తినడం వల్ల రక్తంలో మెగ్నీషియం లెవెల్స్ పెరుగుతాయని వైద్యులు అంటున్నారు. ఖాళీ కడుపుతో తినడం వల్ల అది విషం అయ్యే ప్రమాదం కూడా ఉంది.
సోడా
పరగడుపున కార్బోనేటేడ్ డ్రింక్స్ అసలు తాగకూడదు. వీటిని ఉదయం పూట తాగితో బాడీలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల రోజంతా వికారంగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Bhaskar Katiki is the main admin of the website
Read More