Aloe Vera Benefits: మన ఆయుర్వేదంలో కలబందకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని అందం సంరక్షణ కోసం వినియోగించే ఉత్పత్తుల్లో వాడతారు. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కలబందలో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా ఉంచేందుకు దోహదపడుతుంది. అలోవెరా జెల్ ను జుట్టుకు పట్టించడం ద్వారా జుట్టు బలంగా తయారవుతుంది. కలబంద రసాన్ని జుట్టుకు పెట్టుకోవడం వల్ల చుండ్రు దూరం అవుతుంది. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. దీంతో జుట్టు ఎదుగుదల బాగుంటుంది. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటంతో చుండ్రు మాయమవుతుంది. దీన్ని తలకు పట్టించడంతో చుండ్రు సమస్య రాకుండా పోతుంది.

కలబందలో ఉండే ఎంజైమ్ లు జుట్టుకు లోపల నుంచి రక్షణ ఇస్తుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది. కలబంద జుట్టు నుంచి అదనపు సెబమ్ ను తొలగిస్తుంది. జుట్టును ఆయిల్ ఫ్రీగా చేస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల గాయాలు అయినప్పుడు అక్కడ జెల్ అప్లై చేస్తే గాయాల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మధుమేహ రోగులు రోజు గ్లాస్ కలబంద రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కలబంద రసంలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లు ఉండటం వల్ల మలబద్ధకం నుంచి రక్షణ కలిగిస్తుంది.
ఐస్ క్యూబ్ లో ట్రేలో అలోవెరా జెల్ వేసి ఉంచితే క్యూబ్స్ తయారవుతాయి. వీటిని ముఖంపై మృదువుా రుద్దుకుంటే సహజ మెరుపు వస్తుంది. కలబంద గుజ్జును చర్మంపై నేరుగా రాసుకోవచ్చు. దీంతో చర్మం తేమగా అవుతుంది. కలబందలో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఉన్నాయి. ఇది శరీరంలో మచ్చలు తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో కలబందను రాసుకోవడం వల్ల జుట్టుకు ఎన్నో లాభాలుంటాయి. అనారోగ్య సమస్యల నుంచి ఇది దూరం చేస్తుంది.

జుట్టుకు కలబంద గుజ్జు రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీంతో ఆయుర్వేదంలో కలబందకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలకు జుట్టు రాలిపోవడాన్ని నిరోధించడంలో ఇది ఎంతో సాయపడుతుంది. వివిధ రకాల షాంపుల్లో కూడా కలబంద రసం వాడటం సహజమే. దీంతో కలబందతో మనకు శరీరానికి ప్రయోజనాలు మెండుగానే ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు కలబందను మందుగా ఉపయోగించి పలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.