Breastfeeding: పుట్టిన పిల్లలకు తల్లిపాలు చాలా శ్రేయస్కరం. ఈ పాలు తప్ప ఇతర పాలను ఇవ్వకపోవడమే బెటర్. కొందరు పౌడర్ పాలను, ఆవు, బర్రె పాలను ఇస్తుంటారు. తల్లిపాలు ఇబ్బంది అయిన వారు తప్పా మిగతా వారు కచ్చితంగా తల్లిపాలనే అందించాలి. అయితే పిల్లలకు పాలు ఇస్తున్న ప్రతి తల్లికి చాలా అనుమానాలు ఉంటాయి. కొన్ని సార్లు తల్లులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేదంటే ఇతర సమస్యలతో బాధ పడినా బిడ్డకు పాలు ఇవ్వాలా? వద్దా అనుకుంటారు? మరి ఓ సారి మీ అనుమానం ఇక్కడ క్లియర్ చేసుకోండి.
బాలింతకు జ్వరం వచ్చినా, పీరియడ్స్ వచ్చినా, లేదా ఇతర సమస్యలు వచ్చినా మొదటగా వచ్చే డౌట్ బేబీకి పాలు ఇవ్వాలా? వద్దా అనుకుంటారు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే బిడ్డకు తల్లి పాలను ఇవ్వకూడదు అంటున్నారు నిపుణులు. మిగిలిన కండీషన్ లలో ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వవచ్చట. హెచ్ఐవీ జబ్బు ఉండి దాని తీవ్రత అధికంగా ఉంటే టీబీ ఇన్ఫెక్షన్ ఉండి టీబీ కూడా యాక్టివ్ గా ఉండటం వంటి కండీషన్ లలో మాత్రమే తల్లి పాలు బిడ్డకు ఇవ్వకూడదు అంటున్నారు నిపుణులు.
గెలాక్టోసెమియా అంటే ఈ సందర్బంలో తల్లి పాలలో ఉండే గ్లూకోజ్ ను బిడ్డ సరిగ్గా డైజేషియన్ చేసుకోలేదు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే ఇలాంటి కొన్ని సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాలలో కూడా పిల్లలకు తల్లి పాలు ఇవ్వవచ్చు అంటున్నారు వైద్యులు.
మామూలుగా వచ్చే జ్వరం, జలుబు, దగ్గు వంటి సందర్భాల్లో ఎలాంటి సందేహం లేకుండా బిడ్డకు తల్లి పాలు పట్టించవచ్చు. మరి తెలుసుకున్నారు కదా ఇకనైనా మీ బేబీ గురించి టెన్షన్ వదిలేసి హ్యాపీగా చూసుకోండి. తల్లిపాలను అందించండి. ఆరునెలల వరకు అయినా బిడ్డకు ఇతర పాలు ఇవ్వకుండా కేవలం తల్లి పాలు మాత్రమే అందించాలి.