Antibiotics defects: మనలో చాలామంది ఏదైనా అరోగ్య సమస్య వస్తే ఆ సమస్యకు చెక్ పెట్టడం కోసం యాంటీ బయోటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా సొంతంగా మందులను వాడుతున్నారు. ఎక్కువగా యాంటీ బయోటిక్స్ ను వినియోగించే వాళ్లకు తర్వాత కాలంలో యాంటీ బయోటిక్స్ పని చేయడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు మాత్రమే యాంటీ బయోటిక్స్ ను వాడాలి.
కొన్ని ట్యాబ్లెట్లను కొంతమంది తరచుగా వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల తర్వాత రోజుల్లో ఈ యాంటీ బయోటిక్స్ పని చేయడం లేదు. ఈ ట్యాబ్లెట్లను ఎక్కువ కాలం వినియోగిస్తే కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ యాంటీ బయోటిక్స్ వల్ల కలిగే ముప్పు గురించి హెచ్చరికలు జారీ చేసింది. వైద్యుల సూచనలు లేకుండానే చాలామంది మందులు వాడుతున్నారు.
Also Read: ఈ గింజలు తింటే మధుమేహం కు చెక్ పెట్టవచ్చు.. అవేంటంటే?
మోతాదుకు మించి మందులను తీసుకుంటే ఆ మందులు పని చేయవు. మన శరీరంలో ఆరోగ్యానికి కీడు చేసే బ్యాక్టీరియాతో పాటు మేలు చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. యాంటీ బయోటిక్స్ ఇష్టానుసారం వాడితే శరీరంలోని మంచి బ్యాక్టీరియాకు హాని కలుగుతుంది. కొంతమంది ఆన్ లైన్ లో మెడిసిన్స్ కొనుగోలు చేస్తుండగా మరి కొందరు పాత మందుల చీటీలను వినియోగించి మెడిసిన్స్ కొనుగోలు చేస్తున్నారు.
నిబంధనలను పాటించకుండా కొన్ని మెడికల్ షాపులు మందులను విక్రయిస్తుండటం వల్ల ఇష్టానుసరం మెడిసిన్స్ కొనుగోలు చేసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మెడిసిన్స్ విక్రయించకపోతే తమపై దాడులు చేస్తున్నారని కొంతమంది మెడికల్ షాపుల యజమానులు చెబుతున్నారు.
Also Read: ప్రజల్లో ఆందోళన పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్?