మద్యపానం హానికరం అనే బోర్డులు మద్యం విక్రయించే షాపుల వద్దే ఉంటాయి. కానీ చాలా మంది మద్యం ప్రియులు బోర్డులను కాకుండా మద్యం తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు పనుల్లో బిజీగా ఉన్న వారు రిలాక్స్ కావడానికి మద్యం తీసుకుంటూ ఉంటారు. ఇది మితంగా తీసుకుంటనే సమస్య లేదు. కానీ కొందరు దీనిని వ్యసనంగా మార్చుకొని ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అల్కహాల్ తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని అనుకుంటారు. కానీ ఇది కొత్త రోగాలకు దారి తీస్తుందని చాలా మందికి తెలియదు.వీటితో టెస్టో స్టెరాయిన్ స్థాయి నిల్వలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.
టెస్టోస్టెరాయిన్ అనేది శృంగార హార్మోన్. మనుషుల్లో టెస్టోస్టెరాయిన్ కణజాల పునరుత్పత్తికి దోహదపడుతుంది.ముఖ్యంగా పురుషుల్లో కండరాలు, ఎముక ద్రవ్యరాశి పెరగడం, శరీర జుట్టు పెరుగుదల వంటి వాటికి ఉపకరిస్తుంది. టెస్టోస్టెరాయిన్ సమర్థవంతంగా ఉంటే మానసిక స్థితి నిశ్చలంగా ఉంటుంది. ఎముకల వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది. పురుషులు యాక్టివ్ గా ఉండడానికి టెస్టోస్టెరాయన్ నిల్వలు తగిన మోతాదులో ఉండాలి. అప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుంది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పురుషుల్లో టెస్టోస్టెరాయిన్ నిల్వలు తగ్గడానికి అనేక కారణాలుఉన్నాయి. నిద్రలేమితో పాటు చెడు ఆహారం తినడం, మానసిక ఒత్తిడి, ఊబకాయం ఉన్న వారిలో వీటి నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి. వీటి నిల్వలు తగ్గిపోవడం వల్ల శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తూ ఉంటారు. అయితే శృంగార సమస్యలు ఎదుర్కోవడం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడుతాయి.
ఇటీవల కాలంలో టెస్టోస్టెరాయిన్ నిల్వలు తగ్గడంలో మద్యపానమే కారణమని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు అదే పనిగా ప్రతిరోజూ మద్యం తాగడం వల్ల వీటిపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. నిన్నా, మొన్నటి వరకు మద్యపానంతో కేవలం లివర్ డ్యామేజ్ అని మాత్రమే అన్నారు. కానీ ఇప్పుుడు టెస్టో స్టెరాయిన్ పై కూడా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా సంతానం లేని వారు కొన్నాళ్ల పాటు మద్యపానానికి దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా మద్యం ప్రియులు మద్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.