https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి సినిమాలకే హీరోలు పర్సంటేజ్ తీసుకుంటారా..? బాహుబలి 2 కి పర్సంటేజ్ తీసుకోవడం వల్ల ప్రభాస్ కి ఎంత లాభం వచ్చిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా సక్సెస్ అనేది చాలా కీలకం...ఇక్కడ సక్సెస్ లు సాధిస్తేనే స్టార్ హీరోలుగా వెలుగొందుతారు. తద్వారా ఇండస్ట్రీలో వాళ్ల కంటూ ఒక రేంజ్ ని క్రియేట్ చేసుకోగలుగుతారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 17, 2024 / 11:37 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా సక్సెస్ అనేది చాలా కీలకం…ఇక్కడ సక్సెస్ లు సాధిస్తేనే స్టార్ హీరోలుగా వెలుగొందుతారు. తద్వారా ఇండస్ట్రీలో వాళ్ల కంటూ ఒక రేంజ్ ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అలాగే ప్రేక్షకుల్లో కూడా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. అందుకే సక్సెస్ అనేది చాలా కీలకం…అది లేకపోతే ఇక్కడ ముందుకు సాగడం చాలా కష్టం…

    తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ఉంటుంది… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుందంటే యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ఈయన ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకునేలా చేసింది. ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి 2 సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఇండియాలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే హీరోలందరూ వాళ్ల చేస్తున్న సినిమాల విషయాల్లో చాలా జాగ్రత్త గా ఉంటున్నారు. ఇక సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ రాజమౌళి సినిమా విషయానికి వస్తే మాత్రం మన స్టార్ హీరోలందరు సినిమా ప్రాఫిట్ లో పర్సంటేజ్ అడుగుతున్నారు. కారణం ఏంటి అంటే మిగతా దర్శకుల సినిమాలు ఎలా ఆడతాయో తెలీదు… తద్వారా ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్స్ వస్తాయో లేదో లాసేస్ వస్తాయో కూడా ఎవరికి తెలియదు. ఇక రాజమౌళి సినిమా అంటే మాత్రం పెట్టిన డబ్బులకి డబులు కలెక్షన్స్ ను వసూలు చేస్తుందనే గ్యారెంటీ అయితే అందరిలో ఉంది. తద్వారా ఆయన సినిమాల్లో పర్సంటేజ్ తీసుకుంటేనే హీరోలు ఎక్కువగా లాభపడతారు.

    కాబట్టి వాళ్లు సినిమా ప్రాఫిట్ లో ఎంతో కొంత పర్సంటేజ్ ని అడిగి మరి తీసుకుంటున్నారు. ఇక వాళ్లకు డబ్బుల రూపంలో ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    ఇక ఈ విషయంలో ప్రభాస్ ని ఉదాహరణగా తీసుకుంటే బాహుబలి సినిమా మొదటి పార్ట్ కోసం ఆయన 15 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాడు. ఇక బాహుబలి 2 సినిమా విషయానికి వొస్తే ప్రాఫిట్ లో పర్సంటేజ్ ని అడిగాడు. దాంతో ఈ సినిమా 1900 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి దాదాపు ఆయన 120 కోట్ల వరకు ఈ ఒక్క సినిమా కోసమే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది… ఇక అలా కాకుండా ఆయనకు రెమ్యూనరేషన్ గా ఇవ్వాల్సి వస్తే మాత్రం బాహుబలి సినిమాకి 15 కోట్లు తీసుకున్నాడు. కాబట్టి బాహుబలి 2 సినిమాకి 30 కోట్ల రెమ్యూన రేషన్ మాత్రమే ప్రొడ్యూసర్లు అతనికి ఇచ్చేవారు.

    అలా చేస్తే ఆయన దాదాపు 90 కోట్ల వరకు నష్టపోయేవాడు. అందుకే జక్కన్న సినిమా విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు. కారణం ఏదైనా కూడా జక్కన్న సినిమా విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటూ ఎవరికి వాళ్లు లాభపడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు…