Star heroes : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితేనే ఆ హీరోకి గాని, దర్శకులకు గాని మరొక సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే ఆ తర్వాత అంతకు మించిన రేంజ్ లో సినిమాలను తీయడానికి అవకాశం ఉంటుంది…లేకపోతే మాత్రం వాళ్ళకి పెద్దగా అవకాశాలు రాకపోవచ్చు…
తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మన స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ భారీ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… ఇక ఇదిలా ఉంటే ప్రేక్షకులను అలరించాలంటే సినిమా అనేది బాగా రిచ్ గా ఉండాలని మన దర్శక నిర్మాతలు ఒక సినిమా మీద భారీగా డబ్బులు కుమ్మరించి మరి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఒక సినిమా కోసం వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి భారీ సక్సెస్ లను సాధించి వేలకోట్ల కలెక్షన్స్ ని రాబడుతున్నారు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ సినిమా హీరోలు మాత్రం కొంతమంది రెమ్యునరేషన్స్ తీసుకుంటే మరి కొంతమంది మాత్రం ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ ని అడుగుతున్నారు. ఏదైనా కూడా వీటివల్ల వాళ్ళు చాలా వరకు లాభపడుతున్నారనే చెప్పాలి. ఇక సినిమా తేడా కొడితే ప్రొడ్యూసర్ కి భారీగా నష్టాలు వచ్చే అవకాశమైతే ఉంది. కానీ హీరోలు మాత్రం సేఫ్ జోన్ లో ఉంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతకీ హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోవడం బెస్టా, లేదంటే ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ తీసుకోవడం ఉత్తమమా అనే రీతిలో ఇప్పుడు కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి… ఒక సినిమా భారీ సక్సెస్ సాధిస్తుంది అనే కాన్సెప్ట్ తో హీరో ఉంటే దానికి తప్పకుండా పర్సెంటేజ్ రూపంలో తన వాటా తీసుకోవాలని చూస్తున్నాడు.
అలా కాకుండా సినిమా మీద కొంచెం డౌట్ డౌట్ గా ఉన్నప్పుడు మన హీరోలు ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ముందే డబ్బుల రూపం లో రెమ్యూనరేషన్ ని తీసుకొని సేఫ్ జోన్ లో ఉంటున్నారు. ఇక ముందే రెమ్యూనరేషన్ తీసుకుంటే వాళ్లకు ప్రాఫిట్స్ తో సంబంధం ఉండదు. ఒకవేళ ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చిన వాళ్లకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇచ్చేసారు కాబట్టి ఈ ప్రాఫిట్ లో హీరోలు మరోసారి జోక్యం చేసుకోవాల్సిన అవసరమైతే ఉండదు.
ఇక ఎంత ప్రాఫిట్స్ వచ్చినా అవి ప్రొడ్యూసర్ మాత్రమే తీసుకుంటాడు. ఒకవేళ ప్రొడ్యూసర్ కి ఆ సినిమాతో లాసెస్ కనక వచ్చినట్లైతే హీరో రెమ్యూనరేషన్ ముందే ఇచ్చాడు. కాబట్టి హీరోకి వాటితో ఎలాంటి సంబంధం ఉండదు… ఇక సినిమాలో పర్సంటేజ్ తీసుకుంటే మూవీ సక్సెస్ అయి ఫుల్ ప్రాఫిట్స్ వస్తే పర్లేదు కానీ సినిమా నష్టాల్లోకి వెళ్తే మాత్రం హీరోకి వచ్చే పర్సంటేజ్ విషయంలో కూడా కొంతవరకు తగ్గించి ఇచ్చే ప్రమాదం అయితే ఉంది.
కాబట్టి హీరోలు పర్సంటేజ్ తీసుకోవడం కంటే ముందే డబ్బుల రూపం లో రెమ్యూనరేషన్ తీసుకొవడమే ఉత్తమం… ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమా విషయంలో అదే జరుగుతుంది. సూపర్ సక్సెస్ అయిన పుష్ప 2 సినిమా వల్ల నిర్మాతలకి ఇప్పటివరకు వందకోట్ల ప్రాఫిట్ వస్తే హీరో అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికే 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని సేఫ్ జోన్ లో ఉన్నాడు…