దివిసీమలో మనుషులపై పాముల పగకు కారణం తెలిసింది..

ఇటీవల కృష్ణా జిల్లా నదీ తీర ప్రాంతాల్లో మనుషులపై పాముల దాడి పెరిగిపోయింది. దీనికి కారణమేంటనే విషయంలో అధికారులు, ప్రభుత్వరం తీవ్ర పరిశోదన చేసింది. తాజాగా పాముల వరుస కాటులకు కారణం  తెలిసిపోయింది. వాటి ముఖ్య ఆహారమైన కప్పలతో స్థానికులు వ్యాపారం చేయడమే  కారణమని కనుగొన్నారు. తినడానికి తిండి దొరక్క పాములు జనవావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అందిన ఆహారాన్ని తింటూ అడ్డొచ్చిన వారికి కాట్లు వేస్తున్నాయి. Also Read: హిందుత్వానికి మరక.. ఏపీలో మరో అపచారం కృష్ణా […]

Written By: NARESH, Updated On : September 13, 2020 10:01 am
Follow us on

ఇటీవల కృష్ణా జిల్లా నదీ తీర ప్రాంతాల్లో మనుషులపై పాముల దాడి పెరిగిపోయింది. దీనికి కారణమేంటనే విషయంలో అధికారులు, ప్రభుత్వరం తీవ్ర పరిశోదన చేసింది. తాజాగా పాముల వరుస కాటులకు కారణం  తెలిసిపోయింది. వాటి ముఖ్య ఆహారమైన కప్పలతో స్థానికులు వ్యాపారం చేయడమే  కారణమని కనుగొన్నారు. తినడానికి తిండి దొరక్క పాములు జనవావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అందిన ఆహారాన్ని తింటూ అడ్డొచ్చిన వారికి కాట్లు వేస్తున్నాయి.

Also Read: హిందుత్వానికి మరక.. ఏపీలో మరో అపచారం

కృష్ణా జిల్లాలోని దివిసీమలో పాము కాటు బాధితులు ఎక్కువగా ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతుండటంతో అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. నివారణా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నదీ తీరాన ఉన్న మోపిదేవి సబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇటీవల 17 మంది పండితులు సర్ప శాంతి యాగం కూడా నిర్వహించారు. ఆ తరువాత విషయాన్ని ఆరా తీసిన అధికారులకు దిమ్మ తిరిగే విషయం బయట పడింది.

నదీ తీర గ్రామస్థులు కొంతమంది ఇక్కడ దొరికే వివిధ రకాల జాతుల కప్పలను పట్టుకొని చైనా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారంట. వ్యాపారులు కూడా భారీగా నగదు అందజేస్తుండటంతో చాలా మంది కప్పలను పట్టుకోవడం రోజువారీ వ్యాపకంగా మార్చుకున్నారు.  ఇండియన్ స్కిప్పర్, సదరన్ క్రికెట్ ఫ్రాగ్, ఇండియన్ క్రికెట్ ఫ్రాగ్, బుల్ ఫ్రాగ్ రకాల కప్పలు ఇక్కడ దొరుకుతాయి. ఇటువంటి కొత్త తరహా అక్రమ వ్యాపారం కొనసాగుతుండటంతో పాములకు ఆహార కొరత ఏర్పడింది.

Also Read: లోకేష్ ఆలోచనా తీరు ఎప్పటికీ మారదా…?

దివిసీమ వార్తల్లోకి ఎక్కడం ఇది రెండోసారి. గతంలో 1977లో భీకర తుఫాను వచ్చినప్పుడు జల ప్రళయంలో దాదాపు 9,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరలా ఇప్పుడు పాముల కాట్లతో, కప్పల వ్యాపారంతో వార్తల్లో నిలిచింది. మడ అడవులు ఎక్కువగా ఉండే దివీసీమ కృష్ణా నది, బంగాళా ఖాతం మధ్యలో ఉంటుంది.  ఏటా వర్షాకాలంలో కృష్ణా నది వరద నీరు నివాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే పాముల బెడద ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దివిసీమ అంతటా పాములు బుసలు కొడుతూ, తమ ఆహారాన్ని దోచుుకుపోతున్న మనుషులకు కాట్లు వేస్తున్నాయి.