https://oktelugu.com/

లోకేష్ ఆలోచనా తీరు ఎప్పటికీ మారదా…?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అపర మేధావిగా, చాణిక్యుడిగా పేరు ఉంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడంలో చంద్రబాబు నేర్పరి అని… క్లిష్టమైన సమస్యలకు సైతం సులభమైన పరిష్కారాలను చూపించడంలో చంద్రబాబు దిట్ట అని ఆ పార్టీ నేతలే ప్రశంసిస్తూ ఉంటారు, అయితే ఆయన కుమారుడు లోకేశ్ ప్రస్తావన తెస్తే మాత్రం జడుసుకుంటారు. చినబాబుగా పేరు తెచ్చుకున్న లోకేశ్ బాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. గత ఎన్నికల ముందు టీడీపీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 12, 2020 / 08:24 PM IST
    Follow us on


    మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అపర మేధావిగా, చాణిక్యుడిగా పేరు ఉంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడంలో చంద్రబాబు నేర్పరి అని… క్లిష్టమైన సమస్యలకు సైతం సులభమైన పరిష్కారాలను చూపించడంలో చంద్రబాబు దిట్ట అని ఆ పార్టీ నేతలే ప్రశంసిస్తూ ఉంటారు, అయితే ఆయన కుమారుడు లోకేశ్ ప్రస్తావన తెస్తే మాత్రం జడుసుకుంటారు.

    చినబాబుగా పేరు తెచ్చుకున్న లోకేశ్ బాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. గత ఎన్నికల ముందు టీడీపీ చినబాబు చేసిన కీడు అంతాఇంతా కాదు. వైసీపీని విమర్శించబోయి టీడీపీపై విమర్శలు చేసిన ఘనత లోకేష్ కు సొంతం. తాజాగా చినబాబు మరో అంశంపై వైసీపీపై విమర్శలు చేసి విమర్శల పాలవుతున్నారు. లోకేశ్ బాబు తెలివితేటలు చూసి నవ్వాలో ఏడవాలో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు.

    ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వంట గ్యాస్ ధరలను పెంచినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వంట గ్యాస్ ధ‌ర రాష్ట్రం ప‌రిధిలోనిదా? కేంద్రం పరిధిలోనిదా…? అనే కనీస అవగాహన లేకుండా లోకేశ్ బాబు విమర్శలు చేయడంపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీ వ‌చ్చాకా కూడా వ్యాట్ ఉందని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయనను నవ్వులపాలు చేస్తున్నాయి.

    స్పెష‌ల్ సీఎస్ ర‌జ‌త్ భార్గ‌వ ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపు గురించి స్పందించి స్పష్టత ఇచ్చారు. గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధర పెరగలేదని…. గ్యాస్ పై ట్యాక్స్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని పేర్కొన్నారు. జగన్ సర్కార్ సహజవాయువుపై వ్యాట్ పెంచితే కొన్ని వార్తా ఛానెళ్లు గ్యాస్ ధర పెంచినట్టు ప్రచారం చేయడం గమనార్హం.