Diabetes: షుగర్ తో బాధ పడుతున్నారా.. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే పప్పు ఇదే!

Diabetes: దేశంలో రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వాళ్ల సంఖ్య అంచనాలకు అందని స్థాయిలో పెరుగుతోంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దాని కంటే పెరిగితే షుగర్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. అయితే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవడం ద్వారా డయాబెటిస్ తో బాధపడే వాళ్లు కూడా ఆరోగ్యకరమైన జీవనంను సాగించే అవకాశం అయితే ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు బెండకాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ బెండకాయలు తీసుకోవడం వల్ల శరీరానికి […]

Written By: Kusuma Aggunna, Updated On : April 2, 2022 10:05 am
Follow us on

Diabetes: దేశంలో రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వాళ్ల సంఖ్య అంచనాలకు అందని స్థాయిలో పెరుగుతోంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దాని కంటే పెరిగితే షుగర్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. అయితే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవడం ద్వారా డయాబెటిస్ తో బాధపడే వాళ్లు కూడా ఆరోగ్యకరమైన జీవనంను సాగించే అవకాశం అయితే ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు బెండకాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ప్రతిరోజూ బెండకాయలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బెండకాయలు సులువుగా జీర్ణం కావడంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్లకు ఆరోగ్యానికి రాగిపిండి ఎంతో మంచిదని చెప్పవచ్చు. ఆహారంలో రాగితో తయారు చేసిన వంటకాలను భాగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. డయాబెటిస్ తో బాధపడే వాళ్లను కంటి సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.

పాలకూర, అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు పెసర పప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెసరపప్పులో ఉండే పోషకాల వల్ల డయాబెటిస్ తో బాధ పడే రోగులకు ఎంతో మేలు జరుగుతుంది.

డయాబెటిస్ తో బాధపడే వాళ్లు పాత బియ్యంను తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. స్వచ్చమైన గోధుమపిండితో చేసిన వంటకాలు తీసుకోవడం ద్వారా కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి.