వానాకాలంలో ఈ ఆకును ఇంట్లో కాలిస్తే దోమ‌లు ప‌రార్‌.!

వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచి దోమలు పెరిగిపోయాయి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు కుడుతూ భయంకరమైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ప్రాణాంత వ్యాధులను కలుగ జేస్తున్నాయి.    వర్షాకాలం అంటే రోగాల సీజన్. అందునా ఈ కాలంలో దోమలు విజృంభిస్తాయి. ఆలౌట్, గుడ్ నైట్, టార్టయిస్, ఇలా కంపెనీలేవైనా సరే దోమల నుంచి రక్షణ పొందడానికి ఇప్పుడు ఇంట్లో నిత్యవసరంగా మారిపోయాయి. ఈ దోమల నివారణకు ఓ ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. Also Read: ఉదయాన్నే ఏవి తినాలో, తినకూడదో […]

Written By: NARESH, Updated On : September 16, 2020 4:35 pm

biryani leaf

Follow us on

వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచి దోమలు పెరిగిపోయాయి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు కుడుతూ భయంకరమైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ప్రాణాంత వ్యాధులను కలుగ జేస్తున్నాయి. 
 
వర్షాకాలం అంటే రోగాల సీజన్. అందునా ఈ కాలంలో దోమలు విజృంభిస్తాయి. ఆలౌట్, గుడ్ నైట్, టార్టయిస్, ఇలా కంపెనీలేవైనా సరే దోమల నుంచి రక్షణ పొందడానికి ఇప్పుడు ఇంట్లో నిత్యవసరంగా మారిపోయాయి. ఈ దోమల నివారణకు ఓ ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

Also Read: ఉదయాన్నే ఏవి తినాలో, తినకూడదో తెలుసా.?

ఈ కాలంలో ఎక్కువగా వ‌చ్చే దోమ‌లు, ఈగ‌లు, పురుగులు బిర్యానీ ఆకు కాల్చితే వచ్చే పొగ  వల్ల పారిపోతాయి. రెండు లేదా మూడు బిర్యానీ ఆకుల‌ను తీసుకుని ఒక గ‌దిలో కాల్చాలి.దీంతో వాటి నుంచి పొగ వ‌స్తుంది.ఈ స‌మ‌యంలో గ‌ది నుంచి బ‌య‌టికి వెళ్లి త‌లుపులు పెట్టేయాలి. అలా ఒక 10 నిమిషాల పాటు అలాగే త‌లుపుల‌ను బంధించి ఉంచాలి. దీంతో ఆ పొగ అంతా రూమ్‌లో వ్యాపిస్తుంది. అనంత‌రం రూమ్‌లోకి వెళ్లి ఆ పొగ‌ ఆ వాస‌న‌ను పీల్చాలి.దీంతో మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.ఒత్తిడి,ఆందోళ‌న అంతా మటుమాయం అయిపోతాయి. దోమలు మాత్రం ఈ ఆకు వాసనకు పారాహుషార్ అవుతాయి.
 
వర్షాలకు నీరు ఎక్కడ పడితే అక్కడ నిలుస్తుంది. అందులో దోమలు ఈగలు చేరి వృద్ధి చెంది మనుషుల రక్తం తాగుతుంటాయి. చాలా రోగాలను వ్యాపింప చేస్తుంటాయి. అయితే ఈ కాయిల్స్ వల్ల పెద్ద వాళ్లకు ఏం నష్టం లేదు కానీ.. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇవి వాడలేం.. వారికి దోమల కాయిల్స్ వాడడం వల్ల జలుబు లేస్తుంది.

Also Read: మన కరోనా వ్యాక్సిన్‌ మరింత లేట్‌..వచ్చే ఏడాదే?

 కానీ ఈ ఒక్క బిర్యానీ ఆకుతో దోమలను పారద్రోలవచ్చని తాజాగా పరిశోధనల్లో తేలింది. బిర్యానీ ఆకు. దీన్నే ఇంగ్లిష్‌లో ‘Bay Leaf’ అని పిలుస్తారు.హిందీలో ‘తేజ్ ప‌త్తా’ అంటారు. సాధార‌ణంగా ఎవ‌రైనా ఈ ఆకును బిర్యానీతోపాటు ప‌లు వంట‌కాల్లోనూ వేస్తారు.దీంతో వంట‌కాల‌కు మంచి రుచి, వాస‌న వస్తాయి.అయితే బిర్యానీ ఆకు వ‌ల్ల దోమలు పారిపోయే ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయని పరిశోధనలో తేలింది.