Also Read: ఓటీటీలోకి ‘నిశ్శబ్ధం’గా.. రిలీజ్ డేట్ అదే?
కరోనాతో నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితుల్లో అందరూ ఉద్యోగ, ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. ప్రజలకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలోనే పేదలకు చాలా మంది సాయం చేశారు.
ఈ కరోనా లాక్ డౌన్ లో తన విలువైన సమయాన్ని పేదలకోసం కేటాయించింది గాయని చిన్మయి. గత ఆరు నెలల్లో దాదాపు 3వేల ఆడియోలు రికార్డు చేసింది. వాటిని శ్రోతలకు షేర్ చేసి ఏకంగా రూ.85 లక్షల విరాళం సేకరించింది.
Also Read: కరోనా.. వారినే ఎక్కువ బాధ పెడుతుంది !
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది దాతలు డబ్బును నేరుగా అవసరాల్లో ఉన్న వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇప్పటివరకు ఇలా చిన్మయి రూ.85 లక్షల విరాళం 3వేల పాటలు పాడి సేకరించింది. కరోనా లాక్ డౌన్ లో నిత్యావసర సరుకులు కూడా కొనలేని స్థితిలో ఉన్న వారికి.. ఫీజులు కట్టలేని వారికి ఇవి వెచ్చించింది. ఇప్పుడు చిన్నయి మంచితనానికి ఇండస్ట్రీ మొత్తం మెచ్చుకుంటోంది.