Drinking Alcohol: చాలా మంది ఆల్కహాల్‌కి ఎడిక్ట్ అవుతున్నారు. మంచైనా చెడైనా, వేడుక అయినా విషాదం అయినా మద్యం తాగడం కామన్ అయింది. ప్రతీ రోజు మద్యం తాగేవారు పెరుగుతున్నారు. ఆల్కహాల్ అలవాటు కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వీలైనంత వరకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. ఆల్కహాల్ తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ పెరుగుతుంది. గుండెలో మంట ఉంటుంది. కొందరు మాత్రం లిమిటెడ్‌గా మద్యం తాగడం మంచిదే అంటున్నారు. అయితే మద్యం తాగే ముందు వీటిని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
– మద్యం తాగే ముందు గుడ్డు తీసుకోవడం మంచిది. గుడ్డులో ప్రొటీన్ ఎక్కువగ ఉంటుంది. గుడ్డును తీసుకుని, మద్యం తాగడం వలన ఆకలి తగ్గుతుంది. ఆల్కహాల్ తాగడం ఆలస్యం అవుతుంది. మద్యం తాగేముందు ఆమ్లెట్ తీసుకున్నా పరవాలేదు.
– అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. మద్యం తాగే ముందు అరటిపండు తీసుకుఓవడం చాలా మంచిది. మద్యం తాగే ముందు అరటిపండు తింటే ఆల్కహాల్ వల్ల కలిగే ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఉండదు.
– ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలలో ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ తీసుకునే ముందు చేపలను తీసుకుంటే ప్రొటీన్ బాగా అందుతుంది. దానివలన మద్యం తాగే వారికి ఇబ్బంది ఉండదు.
– ఇక మద్యం తాగే ముందు పెరుగుని తీసుకుంటే జీర్ణ సమస్యలు రావు. మద్యం తాగే ముందు చియా సీడ్స్ తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అవకాడోలను కూడా తీసుకోవచ్చు. అపుపడు ప్రమాదం ఏమీ ఉండదు.
ఎందుకు తీసుకోవాలి..
పైవాటిలో ప్రొటీన్,కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ శోషణను తగ్గిస్తాయి. మద్యం తాగే ముందు టమాటా, ఓట్స్ కూడా తీసుకోవచ్చు. చిలగడ దుంప కూడా మంచిది. ఇలా మద్యం తాగే ముందు ఈ తీసుకోవడం వలన ప్రమాదం నుంచి దూరంగా ఉండొచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.