Health Tips: రాత్రి పూట ఆ పనిచేస్తే చాలా లాభాలట

ఉదయం నుంచి పని చేసి అలాగే పడుకుంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇక రాత్రి పూట స్నానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి నిద్ర వస్తుంటుంది అంటారు నిపుణులు.

Written By: Swathi, Updated On : April 26, 2024 4:58 pm

Health Tips

Follow us on

Health Tips: స్నానం చేయడం వల్ల ఎవరికి అయినా మంచి రిలీఫ్ గా అనిపిస్తుంది. కొందరు స్ట్రెస్ గా ఫీల్ అయితే స్నానం చేస్తుంటారు. ప్రస్తుతం ఎండ తాపం ఎక్కువ ఉండటం వల్ల చెమటలు ఫుల్ గా వచ్చేస్తుంటాయి. చిరాకు ఫుల్ గా అనిపిస్తుంటుంది. చాలా మంది. మరి మీరు కూడా రాత్రి స్నానం చేస్తున్నారా? ఇంతకీ రాత్రి తలస్నానం చేయవచ్చా? ఇలా చేయడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? మంచి ఫలితాలు ఉన్నాయా అనే వివరాలు తెలుసుకుందాం.

ఉదయం నుంచి పని చేసి అలాగే పడుకుంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇక రాత్రి పూట స్నానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి నిద్ర వస్తుంటుంది అంటారు నిపుణులు. గోరువెచ్చిన నీటితో రాత్రి స్నానం చేస్తే రిలీఫ్ ఉంటుంది. అంతేకాదు చక్కని నిద్ర కూడా వస్తుంది. రోజంతా చెమట నుంచి వచ్చే చిరాకు ఇట్టే మాయం అవుతుంది. జస్ట్ స్నానం చేసి రావడంతోనే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంటుంది.

ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రతలో తగ్గుదల మెదడును ప్రశాంతంగా చేసి, మంచి నిద్ర పడుతుంది. రాత్రి పూట స్నానం వల్ల చర్మం శుభ్రం అవడం మాత్రమే కాదు. చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడే వారికి ఫలితం ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి బెస్ట్ ఈ రాత్రి పూట స్నానం. మరీ చల్లగా ఉండే నీటితో స్నానం మాత్రం చేయకూడదు. దీని వల్ల మరింత సమస్యలు పెరుగుతాయి. సో గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి.

రాత్రి పూట తలస్నానం చేయడం వల్ల జలుబు చేస్తుందట. చల్లటి నీటితో అసలే ఈ తలస్నానం చేయకూడదు. ఇక జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కానీ తలస్నానాన్ని స్కిప్ చేసి కేవలం స్నానం మాత్రం చేయండి. దీని వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి అని గుర్తుంచుకోండి.