ప్రస్తుత రోజుల్లో మనుషులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆ ఆరోగ్య సమస్యలకు కొంతమందికి ఆహారపు అలవాట్లు కారణమైతే మరి కొందరికి వ్యక్తిగత అలవాట్లు కారణమవుతున్నాయి. పోషకాలు ఎక్కువగా ఉండేఆహారం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల ఇబ్బంది పడేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లు ఖనిజాలు, విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి.
ఎముకలు బలంగా ఉంటే మాత్రమే ఏ పని అయినా చేయడం సాధ్యమవుతుంది. ఎముకలలో సత్తువ పోయినా కాల్షియం, విటమిన్ డి ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సూర్యకాంతి ద్వారా విటమిన్ డి లభిస్తుండగా కాల్షియం ప్రధానంగా మనం తినే ఆహారంలో ఉంటే మంచిది. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా విటమిన్ డి తో పాటు కాల్షియం శరీరంలో పెరిగే అవకాశం ఉంటుంది.
సాల్మన్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. పాలు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరిగే అవకాశం ఉంది. బ్రోకలీ, క్యాబేజీ, కాల్షియం, బచ్చలికూర తీసుకుంటే అందులో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం వల్ల శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి.
గుడ్డు ప్రోటీన్ కు కేరాఫ్ అడ్రస్ కాగా గుడ్డులో ఉండే పచ్చసొన తింటే శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ లభిస్తాయి. విటమిన్ సి, విటమిన్ కె. విటమిన్ ఎ ఎముకల ఆరోగ్యంకు ఎంతో అవసరం అని చెప్పవచ్చు.