Self care for corona: కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్ననేపథ్యంలో జనం తెగ భయపడిపోతున్నారు. అయితే, అలా తీవ్రంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు, పెద్దలు చెప్తున్నారు. గతంతో పోల్చితే కొవిడ్ వైస్ బలహీనపడిందని, ఇందుకు వ్యాక్సిన్ కారణం కావచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్‌లో జలుబు సాధారణ మాదిరిగా ఉన్నదని, అది పెద్దగా వేధించకుండానే నయం అయిపోతున్నదని వైద్యులు చెప్తున్నారు. అయితే, అలా అని చెప్పి అలసత్వం ప్రదర్శించొద్దు. వైరస్ రకం ఏదైనా కంపల్సరీగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇంట్లోనే ఉంటూ తగు చికిత్స తీసుకోవాల్సిందే. వైరస్ పై అవగాహన పెంచుకుని మసులుకుంటే అతి త్వరలోనే మహమ్మారి అంతం ఖాయమని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి. అది చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కానీ, డెల్టా వేరియంట్ మాదిరిగా ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇది శరీరంలోని ఊపిరితిత్తులు, శ్వాసనాళాలపైన పెద్దగా ప్రభావం చూపడం లేదు. కేవలం ముక్కు దిబ్బడ, జ్వరం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. అవి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే నయమైపోతున్నాయి కూడా.కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అక్కర లేదు.
Also Read: Corona vs Normal Fever: జలుబు, దగ్గు.. కొవిడా.. సాధారణ జ్వరమా.. నిపుణులు ఏమంటున్నారంటే?
కొవిడ్ నిర్ధారణ పరీక్షల ద్వారా వేరియంట్‌ను గుర్తించడం కొంచెం కష్టతరమవుతున్నదన్నది నిపుణులు చెప్తున్న మాట. కాబట్టి ఎటువంటి రకం వైరస్ అయినా అశ్రద్ధ చూపడం మాత్రం అస్సలు తగదని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే కొవిడ్ మహమ్మారి బారిన పడి ఇన్ఫెక్షన్స్ వచ్చినపుడు పేషెంట్స్ ట్రీట్ మెంట్ లో ఫస్ట్ స్టేజీలోనే కోలుకుంటున్నారని, మునుపటిలాగా ఆక్సిజన్, రెమ్ డెసివిర్ అవసరం అంతగా పడటం లేదని వైద్యులు చెప్తున్నారు. ఇది కొంత ఊరట కలిగించే విషయమేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, కొందరు ఒంట్లో నలతగా ఉంటే ఏం కాదులే.. అని జనంలో తిరిగేస్తున్నారు. అది మంచిది కాదు. జ్వరం, గొంతు నొప్పి వంటి అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితేవెంటనే అప్రమత్తమై ఇంటిలోపల ఉండాలి. లక్షణాలు మామూలుగా ఉన్నాయి కాబట్టి పారసిటమాల్ మాత్రలు యూజ్ చేయాలి. ఆ తర్వాత అవసరమైతే వైద్యుడిని సంప్రదించి తగు మాత్రలు తీసుకోవాలి. అలా చేస్తున్న క్రమంలో లక్షణాలు తగ్గుముఖం పడితే ఎటువంటి సమస్యలేదు. కానీ, అయినా అలానే లక్షణాలుంటే కనుక కొవిడ్ టెస్ట్ చేయించుకుని తగు వైద్యం చేయించుకోవాలి.
Also Read: Corona: కరోనా విలయం.. దేశంలో థర్డ్ వేవ్ తప్పదా? ఏపీ, తెలంగాణను వణికిస్తున్న మహమ్మారి