కరోనా మహమ్మారి విజృంభణ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా విధులు నిర్వహించే వారిలో చాలామంది పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కంపెనీలు కరోనా ఉధృతి తగ్గినా వర్క్ ఫ్రమ్ ఆప్షన్ ద్వారానే ఉద్యోగులు విధులు నిర్వహించేలా చేస్తున్నాయి. ఫలితంగా డి విటమిన్ లోపంతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డి విటిమిన్ లోపం ఉన్నవాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Also Read: పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎక్కువగా వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..?
శరీరంలోని కండరాలు బలహీనంగా కాకుండా చేయడంలో, బోన్స్ కు అవసరమైన క్యాల్షియంను శోషించుకోవడంలో విటమిన్ డి సహాయపడుతుంది. డి విటమిన్ లోపం ఉన్నవాళ్లు రక్తపోటు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ప్రధాన అవయవాలలో ఒకటైన గుండె పనితీరును చురుకుగా ఉంచడంలో డి విటమిన్ సహాయపడుతుంది. విటమిన్ డి లోపం ఉన్నవాళ్లు నీరసం, అలసటతో బాధ పడుతూ ఉంటారు.
Also Read: సపోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
మొటిమలు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు వేధిస్తున్నా డి విటమిన్ లోపం అయ్యే అవకాశం ఉంది. డి విటమిన్ లోపం ఉంటే జుట్టు రాలడం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా ఎక్కువగా వేధిస్తాయి. విటమిన్ డి లోపం ఉన్నట్లయితే ఉదయం కొంత సమయం ఎండలో ఉంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎండలో నడవడం, వ్యాయామం చేయడం ద్వారా విటమిన్ డి లోపం ద్వారా వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
అయితే శరీరానికి తగినంత మేరకే డి విటమిన్ కావాలి. డి విటమిన్ ఎక్కువైనా కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. డి విటమిన్ లోపం ఉంటే వైద్యులను సంప్రదించి వైద్యుల సూచనల మేరకే విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడాలి.