Surya Gochar 2022: సూర్యుడు నెలకోసారి తన గమనం మార్చుకుంటాడు. ఒకో నెలలో ఒకో రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో రాశులపై ప్రభావం పడుతుంది. గత నెలలో కన్యారాశిలో ఉన్న సూర్యుడు ఈ నెలలో తుల రాశిలోకి మారుతాడు. దీంతో కొన్ని రాశులకు శుభాలు చేకూరనున్నాయి. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశి మారుతూ ఉంటుంది. ప్రతి నెల మూడు నాలుగు గ్రహాలు రాశిచక్రాన్ని మారుస్తాయి. సూర్యుడు కూడా రాశులు మారుస్తూ ఒక్కో రాశిలో ఒకో నెల ఉంటాడు. సూర్యునికి గ్రహాల రాజుగా పిలుస్తుంటారు.

సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. మకర రాశిలోకి వెళితే మకర సంక్రాంతి అని మీన రాశిలోకి ప్రవేశిస్తే మీన సంక్రాంతి అని చెబుతుంటారు. సూర్యుడు ఈనెల 17న తుల రాశిలోకి మారబోతున్నాడు. దీంతో నాలుగు రాశులకు అన్ని శుభాలు కలగనున్నాయి నెల రోజుల పాటు సూర్యుడు తుల రాశిలో ఉంటాడు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు సూర్యుడు తుల రాశిలో ఉండటంతో ఐదు రాశులకు భారీ లాభాలు కలగనున్నాయి. దీంతో వారికి పట్టిందల్ల బంగారమే కానుంది.
సూర్యుడు రాశి మారడం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచిస్తున్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి అనుకూలమైన కాలం. దీంతో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా సింహరాశి వారికి కూడా లాభాలున్నాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగ సంబంధిత సమస్యలు కూడా సమసిపోతాయి.

ఇక ధనుస్సు రాశి వారికి కూడా శుభాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మకర రాశి వారికి కూడా మంచి లాభాలు కలగనున్నాయి. పెట్టుబడులకు మంచి కాలం. ఆఫీసుల్లో పనిచేసే వారికి ప్రశంసలు వస్తాయి. ఇంకా మీన రాశి వారికి కూడా ఎన్నో మంచి ఫలితాలు ఉన్నాయి. పెట్టుబడులకు అనుకూలం. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం. కార్యాలయాల్లో ప్రశంసలు వస్తాయి. కొత్త బాధ్యతలు పొందే అవకాశం. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇలా సూర్యుడు తుల రాశిలోకి మారడం వల్ల ఈ ఐదు రాశుల వారి దశ మారనుంది.