Sun Temparature: 2024 ఏడాదిలో ఎండలు మండనున్నాయి. వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే వేడి పెరిగింది. మార్చి 1వ తేదీన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఈ వారం రోజులు మరింతగా వేడెక్కె అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. 2023 కంటే ఈ ఏడాది మరింత ఎండలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ, నైరుతి నుంచి వడగాలులు తీవ్రంగా వీస్తుండడంతో వాతావరణం వేడెక్కనుంది. ఉష్ణోగ్రతలు వరుసగా గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలుగా కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు.
గతేడాది తెలంగాణలో ఇదే సమయంలో 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. కానీ ఆ సమయంలో పెద్దగా వేడి అనిపించలేదు. కానీ ఈసారి మాత్రం అప్పుడే ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటే వేడి వాతావరణం ఉండడంతో కొంత మంది ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఇప్పటి వరకు గరిష్టంగా తెలంగాణలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఇంతలా ఉంటే మే, జూన్ నెలలో ఏవిధంగా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆదివారం నుంచి గురువారం వరకు ఎండలు మరింతగా విజృంభించే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, నల్గొండ, నిజామాబాద్; హైదరాబాద్ లల్లో ఉష్ణోగ్రతలు రోజుకు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగనున్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ వేడి నుంచి రక్షించుకునేందుకు పలు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని యానం వైపు దిగువన ఉన్న ఆగ్నేయ దిశలో వడగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుంది. కానీ ఉదయం తేలికపాటి మంచు ఉంటుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. పొగమంచు ఉండడంతో పాటు ఎండ వేడి ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణం అధికారులు తెలిపారు.