Homeలైఫ్ స్టైల్Summer Dehydration Remedies: ఎండలు మండిపోతున్నాయి.. ఇలా చేస్తే మీ శరీరం హైడ్రేట్

Summer Dehydration Remedies: ఎండలు మండిపోతున్నాయి.. ఇలా చేస్తే మీ శరీరం హైడ్రేట్

Summer Dehydration Remedies: మిగతా కాలాలతో పోల్చి చూస్తే ఎండాకాలంలో మన శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటుంది. అలా బయటికి వెళ్లే నీటిలో లవణాల శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు. ఎండాకాలంలో శరీరాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. శీతల పానీయాలు.. ఐస్క్రీమ్లు తింటే శరీరం హైడ్రేట్ అవుతుందని భావిస్తుంటారు. కానీ అది ముమ్మాటికి తప్పు.

వేసవి ఎండ వల్ల అధిక వేడి ఉత్పన్నమవుతుంది. ఫలితంగా శరీరంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల డిహైడ్రేషన్ వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే కొంతమంది శీతల పానీయాలు తాగుతుంటారు. శీతల పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఎందుకంటే అందులో చక్కెర శాతం.. శరీరానికి హాని చేసే ఇతర పదార్థాల శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని వాడకపోవడం అత్యంత ఉత్తమం.

ప్రకృతిలో లభించే పదార్థాలతో పానీయాలు తయారు చేసుకుని శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. దీనివల్ల శరీరం లో లవణాలు అలానే ఉంటాయి. ఫలితంగా శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. దీనివల్ల శరీరం నిర్జలీకరణకు గురికాదు. ప్రకృతిలో లభించే పదార్థాలతో తయారు చేసే పానీయాల వల్ల శరీరంలో ఎటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకోవు.

ఎండాకాలంలో పుదీనా అధికంగా లభిస్తూ ఉంటుంది. పుదీనా, నిమ్మరసం, తేనె, వేయించిన జీలకర్ర పొడి మిశ్రమంతో అద్భుతమైన పానీయం తయారు చేసుకోవచ్చు. పై పదార్థాలను మిక్సీలో పట్టుకోవాలి. దానికి కొంతమేర నీటిని చేర్చాలి. మిశ్రమం అయిన తర్వాత.. దాన్ని ఒక గాజు గ్లాసులోకి తీసుకోవాలి. కొద్దిగా ఐసు ముక్కల్ని వేసుకుంటే.. నిమ్మకాయ షర్బత్ రెడీ అవుతుంది. ఈ షర్బత్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

పుదీనా ఆకుల వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోకి చేరుతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తేనె కూడా రుచిని మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీలకర్ర జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అజిత్ ఇటువంటి సమస్యను తగ్గిస్తుంది. ఈ షర్బత్ వల్ల శరీరంలో నీటి శాతం తగినంత ఉంటుంది. మండే ఎండల్లో బయటకు వెళ్లినప్పటికీ శరీరం నిర్జలీకరణకు గురికాదు. ఎండాకాలంలో ఈ పానీయాన్ని ఎక్కువగా తాగాలని చెబుతున్నారు వైద్యులు.

గమనిక

పుదీనా నిమ్మకాయ షర్బత్ తయారీని వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారం ఆధారంగా ఓకే తెలుగు పాఠకులకు అందించాం. ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ అయితే.. వైద్యుల చికిత్సకు ఈ పానీయం ప్రత్యామ్నయం కాదు. ముందుగా వైద్యులను సంప్రదించిన తర్వాత.. వారు ఇచ్చిన సలహాలను రోగులు పాటించాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular