Sugar-Free Diet Tips: ఒక పదార్థం తీపిగా ఉండాలంటే అందులో చక్కెర కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ప్రస్తుత కాలంలో చాలావరకు పదార్థాల్లో చక్కెర ఉంటుంది. మోతాదుకు మించిన చక్కెర వాడడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చక్కెర శరీరంలోకి ఎక్కువగా వెళ్లడం వల్ల డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని పదార్థాల రుచి కోసం చక్కెర తప్పనిసరిగా అంటున్నారు. కానీ చక్కెర లేకుండా పదార్థాలను తినడం ఎలా అని అనుకునే వారికి బెల్లం ప్రత్యామ్నాయంగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చక్కెర కంటే బెల్లం తీపి ఎక్కువగా ఇవ్వడం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను తీసుకొస్తుంది. అంతేకాకుండా బెల్లంలో ఉండే సహజ సిద్ధమైన గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. అసలు బెల్లంలో ఉండే మూలకాలు ఏంటి? బెల్లం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
పూర్వీకులు చక్కెర అందుబాటులో లేకపోవడంతో బెల్లం తోనే రకరకాల పదార్థాలు చేసుకునేవారు. బెల్లం తో పాటు నువ్వులు, పల్లీలు కలిపి తినడం వల్ల శరీరానికి ఎక్కువగా ప్రోటీన్లు అందించిన వారవుతారు. వీటిని చిన్నపిల్లలకు చిక్కిలా ద్వారా వారు నిత్యం యాక్టివ్ గా ఉంటారు. అలాగే మెదడు కూడా షార్ప్ గా తయారవుతుంది. బెల్లం లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, బాసరమ్ తో పాటు జింక్, సెలీనియం వంటి విటమిన్ లో ఉంటాయి. బెల్లంలో అనేక ఔషధ మూలకాలు ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదిక మందుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తక్షణ శక్తి రావడానికి బెల్లం ఎంతో ఉపకరిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా బెల్లం సహాయపడుతుంది.
చక్కెర తినడం వల్ల గ్లూకోస్ ఎక్కువ కావడంతో పాటు శరీరం బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ బెల్లం తినడం వల్ల కొవ్వు పెరిగే అవకాశాలు ఏమాత్రం లేదు. అంతేకాకుండా బరువు తగ్గాలని అనుకునేవారు బెల్లంతో చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల ఎముకలు, దంతాలు గట్టి పడతాయి. అలాగే కీళ్ల నొప్పులు, నెలసరి నొప్పులు ఉన్నవారు బెల్లంలో కాస్త అల్లం వేసుకొని తినడం వల్ల ఎంతో ఎనర్జీగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా ఉండడానికి ఇది ఎంతో సహకరిస్తుంది.
ప్రస్తుత కాలంలో చక్కెర తినడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తినే చాక్లెట్స్ వంటి పదార్థాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అయితే వారికి చక్కెర కలిగిన పదార్థాల కు బదులు బెల్లం కలిగిన పదార్థాలను కలిపి ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా నిత్యం ఎనర్జిటిక్ గా ఉండి మెదడు ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు తాగే టీలో చక్కెరకు బదులు బెల్లం వేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.