పాకిస్తాన్.. వార్తల్లో నిలవని రోజు లేదు. కాకపోతే మంచి వార్తలతో కాదు. హారిఫైడ్ న్యూస్ లు వస్తున్నాయి. కేపీకే , బెలూచిస్తాన్, పీవోకేలో నిరసనలు, పంజాబ్ లో ఎల్టీపీ ల ఆందోళనలతో పాకిస్తాన్ అట్టుడుకుతోంది. ఇవే కాదు.. మూడు రోజుల కిందట.. యూఏఈ దేశం తాజాగా పాకిస్తానీయులకు వీసాలు నిరాకరిస్తోంది. కొత్తగా ఎవరు అప్లై చేసుకున్నా 100 కి 80 శాతం రిజెక్ట్ చేస్తున్నారట..
వినడానికే ఇది గా ఉంది. పాకిస్తానీలు వచ్చి యూఏఈలో బెగ్గర్ గా మారిపోతున్నారు. విజిటింగ్ వీసాలపై వచ్చి యూఏఈలో అడుక్కుంటున్నారని యూఏఈ తాజాగా పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిరాకరిస్తోంది. ఇలా ప్రతీరోజూ ఏదో ఒక వార్త ఉంటూనే ఉంటుంది.
ఇప్పుడు వస్తున్న వార్త.. ‘అసలు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? బతికి ఉంటే ఏ విధంగా టార్చర్ పెట్టారు? బతికి లేకుంటే ఏం చేశారు? ఎవరినీ కలవకుండా పెట్టారని’ అనుమానాలున్నాయి.. నవంబర్ 4న వారి చెల్లెలు చివరగా కలిశారు. కలుస్తామని చెప్పినా కలవనీయడం లేదు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా కలవనీయడం లేదు.
ఖైబర్ ఫంక్తున్వా ముఖ్యమంత్రి కోర్టు ఆర్డర్ తెచ్చినా కలవనీయడం లేదని ఇమ్రాన్ ఖాన్ జైలు ముందర ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అయినా కలవనీయడం లేదు.
నియంత మునీర్ కి రోజులు దగ్గర పడ్డాయి.. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.