విటమిన్ బీ12 లోపంతో బాధ పడుతున్నారా.. తీసుకోవాల్సిన ఆహారాలివే?

ప్రస్తుత కాలంలో ఎంతోమందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ప్రజలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో విటమిన్ల లోపం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి విటమిన్ బీ12 ఎంతో ముఖ్యం కాగా విటమిన్ బీ12 లోపం వల్ల రక్త హీనత, కీళ్ల నొప్పులు, ఎముకల సంబంధిత సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడతాయి. ప్రతిరోజూ గుడ్డును […]

Written By: Kusuma Aggunna, Updated On : November 18, 2021 9:43 am
Follow us on

ప్రస్తుత కాలంలో ఎంతోమందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ప్రజలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో విటమిన్ల లోపం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి విటమిన్ బీ12 ఎంతో ముఖ్యం కాగా విటమిన్ బీ12 లోపం వల్ల రక్త హీనత, కీళ్ల నొప్పులు, ఎముకల సంబంధిత సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడతాయి.

ప్రతిరోజూ గుడ్డును తినడం ద్వారా బీ12 లోపాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ భోజనం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సూప్‌లు, స్టైర్ ఫ్రైస్‌లో బాయిల్డ్ ఎగ్‌లను తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్ బీ12 పనీర్ లో పుష్కలంగా ఉంటుంది. శాఖాహారులకు పనీర్ ఎంతో మంచిది. భోజనంలో పనీర్ ను భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన బీ12 లభిస్తుంది.

పాల ఉత్పత్తులలో కూడా శరీరానికి అవసరమైన బీ12 ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియకు మేలు చేయడంతో పాటు దుకాణంలో సులువుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సాల్మోన్ లో కూడా శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ బీ12 లోపాన్ని తగ్గించడంలో సాల్మోన్ ఉపయోపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ బీ12 చికెన్ లో ఉంటుంది.

చికెన్ ద్వారా శరీరానికి అవసరమైన లీన్ ప్రోటీన్స్ కూడా లభిస్తాయి. చికెన్ తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఆహారపు అలవాట్లను మార్చుకున్నా ఈ సమస్యను అధిగమించని పక్షంలో వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది.