చలికాలంలో మనలో చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో ఎక్కువగా దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
చలికాలంలో యాపిల్ ను కచ్చితంగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతాం కాబట్టి మలబద్ధకం సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. యాపిల్స్ లో ఉండే పెక్టిన్ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని నివారించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శీతాకాలంలో వేధించే ఆరోగ్య సమస్యలలో కీళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటని చెప్పవచ్చు.
శీతాకాలంలో దానిమ్మ పండును తినడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. దానిమ్మ పండులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు సాధారణ వ్యాధులను సైతం నివారిస్తాయి. అత్తి పండ్లలో శరీరానికి అవసరమైన పొటాషియం పుష్కలంగా ఉంటుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లు అత్తి పండ్లు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
శీతాకాలంలో లభించే పండ్లలో నారింజ పండ్లు కూడా ఒకటి కాగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో నారింజ పండ్లు తోడ్పడతాయి. చలికాలంలో లభించే పండ్లలో సీతాఫలం ఒకటి కాగా సీతాఫలం ద్వారా విటమిన్ బి6, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు అందుతాయి. క్రమం తప్పకుండా ఈ పండ్లను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.