https://oktelugu.com/

Actor Darshan: కన్నడ నటుడి క్రైం కథా చిత్రం.. రాక్షసంగా అభిమాని హత్య!

తాజాగా కన్నడ నటుడు దర్శన్‌ క్రైమ కథా చిత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో క్యారెక్టర్లలా ఉన్న దర్శన్, అతని ప్రియురాలు కలిసి ఓ అభిమానినే చంపేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 14, 2024 / 12:46 PM IST

    Actor Darshan

    Follow us on

    Actor Darshan: సినిమారంగం అంటే.. రంగుల ప్రపంచం. ఇందులో పైకి కనిపించే మెరుగులు కొంతే.. మెరుగు లెనుక ఎంతో చీకటి ఉంటుంది. ఎన్నో జీవితాలు చీకట్లో మగ్గిపోతుంటాయి. అనైతిక సంబంధాలు, అరాచకాలు వీటికి అదనం. ఇలాంటి ఘటనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో సినిమా పత్రికల్లో ఇలాంటి సంబంధాల గురించి వార్తలు వచ్చేవి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో.. గాసిప్స్‌ రూపంలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కన్నడ నటుడు దర్శన్‌ క్రైమ కథా చిత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో క్యారెక్టర్లలా ఉన్న దర్శన్, అతని ప్రియురాలు కలిసి ఓ అభిమానినే చంపేశారు.

    చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని…
    కర్ణాటకకు చెందిన రేణుస్వామిని దర్శన్‌ హత్య చేయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణుస్వామి దర్శన్‌గురించి సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టాడని తెలుసుకున్న దర్శన్, అతని ప్రయురాలు.. తమ అభిమానులను రేణుస్వామిపైకి ఉసిగొల్పారు. దర్శన్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రసాయంతో మరికొందరు అభిమానులు కలిసి రేణుస్వామిని హతామర్చారు.

    ప్రియురాలి ప్రోద్బలంతో..
    నటుడు దర్శకుడు తన ప్రియురాలు పవిత్ర ప్రోద్బలంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దర్శన్, పవిత్రగౌడ పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దర్శన్‌కు అప్పటికే విజయలక్ష్మితో వివాహం అయింది. దీంతో ముగ్గురి మధ్య గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చు పెట్టిందని దర్శన్‌ అభిమాని రేణుస్వామి ఆగ్రహంతో ఉండేవాడు. పవిత్ర ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు అశ్లీల మెస్సేజ్‌లు పంపేవాడు.

    వార్నింగ్‌ ఇద్దామనుకుని..
    ఇక రేణుస్వామికి వార్నిగ్‌ ఇద్దామని దర్శన్‌ భావించాడు. ఈమేరకు బెంగళూరుకు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో రాఘవేద్రకు అప్పగించి అతడిని ఓ షెడ్డు వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. బౌన్సర్లు కూడా దాడిచేశారు. దీంతో రేణుస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లి కాలువలో పడేశారు.

    ఆర్థిక లాబాదేవీల్లో వివాదంతో..
    ఇక ఈ విషయం నిందుల మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీలతో వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు నిందితులు నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయారు. పోలీసుల విచారణలో హత్య వెనుక నటుడు దర్శన్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అతడితోపాటు పవిత, రాఘవేంద్రను అరెస్ట్‌ చేశారు.